AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

హైదరాబాద్ MMTS‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో పోలీసులు విచారణం వేగవంతం చేశారు. 4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ తరుణంలో ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసులో పురోగతి సాధించారు.. ఈ ఘటనలో అనుమానితుడిని గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
Crime News (representative image)
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2025 | 12:37 PM

Share

హైదరాబాద్ MMTS‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో పోలీసులు విచారణం వేగవంతం చేశారు. 4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ తరుణంలో ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసులో పురోగతి సాధించారు.. ఈ ఘటనలో అనుమానితుడిని గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి మేడ్చల్‌ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. అనుమానితుడి ఫొటోను పోలీసులు బాధితురాలికి చూపించారు. అత్యాచారయత్నం చేసింది అతనేనని యువతి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.. కాగా.. ఏడాది క్రితమే మహేష్ ను భార్య వదిలివేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన అతడు పాత నేరస్థుడని పోలీసులు పేర్కొంటున్నారు.

4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్ వరకు ఉన్న అన్ని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి అనుమానితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సికింద్రాబాద్‌తోపాటు మేడ్చల్‌ వరకూ 28 కిలోమీటర్ల ప్రాంతంలోని రైల్వేస్టేషన్లు, అన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

కొనసాగుతున్న చికిత్స..

కాగా.. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇంటర్నల్ గాయాలతో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని మూడ్రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు వైద్యులు.. ఫేస్ బోన్స్ ఎక్కువగా గాయపడినట్లు చెప్తున్నారు. రాత్రి సీటి స్కాన్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. మూడ్రోజుల తర్వాత ఆమె దవడభాగంలో శస్త్ర చికిత్స చేయనున్నారు వైద్యులు..

అసలేం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. మేడ్చల్‌లో ఉంటున్న యువతి.. ఈనెల 22న సాయంత్రం సెల్‌ఫోన్‌ రిపేర్ కోసం సికింద్రాబాద్‌ వచ్చింది. అనంతరం రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్‌లో తెల్లాపూర్‌-మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలులోని మహిళల బోగీలో ఎక్కి కూర్చుంది.. రైలు 8.15 గంటల సమయంలో అల్వాల్‌ స్టేషన్‌కు చేరుకున్నాక బోగీలోని ఇద్దరు మహిళలు దిగిపోవడంతో యువతి ఒక్కతే దానిలో ఉంది. ఈ సమయంలో ఆగంతకుడు యువతి దగ్గరకెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు.. ఆమెపై బలాత్కారానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిన యువతి కొంపల్లి సమీపంలో రైలు నుంచి దూకింది. తీవ్రగాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు గమనించి 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..