Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై చివరి రైలు..
అయితే ఇకపై ప్రతీ సోమవారం ఉదయం 5.30గంటలకే తొలి మెట్రో ప్రారంభంకానుంది. ఇది కేవలం వారంలో ఒక్క రోజు మాత్రమే. ఇతర రోజుల్లో ఉదయం 6 గంటల నుంచే రైలు ప్రారంభమవువుతుంది. సోమవారం ప్రస్తుతం మెట్రోలో రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో...

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, తక్కువ ధరలోనే ఏసీలో ప్రయణించే అవకాశాన్ని కల్పించిన హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సదవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా ప్రయణించే వారికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడనుంది. మెట్రో వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా మెట్రో చివరి రైలు ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చివరి రైలు సమయాన్ని పొడగించారు. ఇకపై మెట్రో చివరి రైలు రాత్రి 11.45 గంటలకు బయలు దేరనుంది. దీంతో లేట్ నైట్ ఆఫీస్ డ్యూటీలు చేసే వారికి ఎంతగానో ఉపయోగపడనుంది. చివరి గమ్యస్థానానికి రాత్రి 12.45 గంటలకు చేరుకోనుంది. అలాగే సాధారణంగా ఉదయం 6 గంటలకు మెట్రో తొలి ప్రారంభమవుతుందనే విషయం తెలిసిందే.
అయితే ఇకపై ప్రతీ సోమవారం ఉదయం 5.30గంటలకే తొలి మెట్రో ప్రారంభంకానుంది. ఇది కేవలం వారంలో ఒక్క రోజు మాత్రమే. ఇతర రోజుల్లో ఉదయం 6 గంటల నుంచే రైలు ప్రారంభమవువుతుంది. సోమవారం ప్రస్తుతం మెట్రోలో రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాల పాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే మెట్రో నిర్వహణపై ఇటీవల ఎల్ అండ్ టీ కంపెనీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్ఛనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మెట్రో నష్టాలు ఎదుర్కొంటోందని, దీంతో మెట్రోను విక్రయించాలనే ఆలోచనతో ఉన్నట్లు ఎల్ అండ్ టీ సీఎఫ్ వో ఆర్ శంకర్ రామన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి అందరినీ షాక్‌కి గురి చేశారు. అయితే దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించిన విషయం తెలిసిందే. ఉచిత బస్సు సౌకర్యం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




