AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనాలు.. అలర్ట్‌గా లేకపోతే.. నెక్ట్స్‌ టార్గెట్ మీరే కావచ్చు..

హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు ఇళ్లు ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాలే టార్గెట్‌గా దోపిడీకి పాల్పుతున్న కేటుగాళ్లు తాజాగా ఖరీదైన కార్లకే టెండర్ వేశారు. అర్థరాత్రి వీధుల్లోకి వచ్చి ఇళ్ల ముందు పార్క్ చేసిన ఖరీదైన కార్లను మాయం చేస్తున్నారు. తాజాగా ఇలానే పాతబస్తీలో ఓ ఫార్చ్యూనర్ కార్‌ను ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు.

హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనాలు.. అలర్ట్‌గా లేకపోతే.. నెక్ట్స్‌ టార్గెట్ మీరే కావచ్చు..
Hyderabad Luxury Car Thefts
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 5:07 PM

Share

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటి వరకు ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను మాత్రమే ఎత్తుకెళ్లే దొంగలు ఇప్పుడు రూట్ మార్చి.. ఖరీదైన కార్లపై కన్నేశారు. పక్కాగా రెక్కీ నిర్వహించి, సీసీటీవీల కన్నుగప్పి నిమిషాల వ్యవధిలోనే కార్లను మాయం చేస్తున్నారు. తాజాగా పాతబస్తీలోని ఐఎస్‌ సదన్ పీఎస్‌ పరిధిలో ఓ లగ్జరీ కారును కొట్టేశారు కేటుగాళ్లు. బాధితుల సమచారాంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

లగ్జరీ కార్లే టార్గెట్‌గా దొంతనాలకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంపాపేట్ సమీపంలోని న్యూ మారుతీ నగర్, ఒవైసీ హాస్పిటల్ పరిధిలో ఓ ఫార్చ్యూనర్ కారు చోరికి గురైంది. శనివారం అర్ధరాత్రి సుమారు 3:20 గంటల సమయంలో సమీర్ ఉల్లా అనే వ్యక్తికి చెందిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ కారును అజ్ఞాత దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు గమనించి చూసేసరికి పార్కింగ్ స్థలంలో కారు కనిపించకపోవడంతో వెంటనే స్థానిక ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం అందించారు.

బాధితుడు సమీర్ ఉల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. ఈ దోపిడి ఎవరైనా తెలిసిన వాళ్లే చేశారా? లేదా ఈ చోరీ వెనుక ఏదైనా పెద్ద అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us