AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tankers: ఎల్‌నీనో ఎఫెక్ట్.. నవంబర్ ఫస్ట్‌ నుంచి కొత్త వాటర్ ట్యాంకర్స్‌.. ప్రత్యేకంగా వారికోసమే

ఎల్‌నీనో ప్రభావంతో నెలకొన్న కరువ పరిస్థితులను అదిగమించి.. నీటి కొరతను తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుండి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Green Tankers: ఎల్‌నీనో ఎఫెక్ట్.. నవంబర్ ఫస్ట్‌ నుంచి కొత్త వాటర్ ట్యాంకర్స్‌.. ప్రత్యేకంగా వారికోసమే
Green Water Tankers From Nov 1
Anand T
|

Updated on: Oct 23, 2026 | 8:30 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూగర్భ జలాల పరిరక్షణతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, గ్రీనరీ, ఇతర తాగునీరు అవసరం లేని పనులకు వినియోగించేలా నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

రానున్న ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగాన్ని పెంచేందుకు చేపడుతున్న చర్యలపై శుక్రవారం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రీన్ వాటర్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్యాంకర్ల నమోదు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్లు

నిర్మాణ రంగం, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో శుద్ధి చేసిన నీటికి ఉన్న డిమాండ్‌ను ప్రాంతాలవారీగా అంచనా వేయాలని ఎండీ సూచించారు. అందుకు అనుగుణంగా సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎస్టీపీలను గుర్తించి గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫిల్లింగ్ పాయింట్లు, ప్లాట్‌ఫారాలు, పంపింగ్ సదుపాయాలు, ఫ్లో మీటర్లు, ఇతర మౌలిక వసతులను సమకూర్చాలని పేర్కొన్నారు.

ట్యాంకర్లకు ప్రత్యేక బ్రాండింగ్..

గ్రీన్ వాటర్ సరఫరాలో పారదర్శకత ఉండేలా ప్రతి ట్యాంకర్‌కు ప్రత్యేక బ్రాండింగ్‌తో పాటు జీపీఎస్ పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ల కదలికలు, సరఫరా సమయాలు, డెలివరీ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటు చేసి, ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణం, బుకింగ్, సరఫరా వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

బుకింగ్ నుంచి డెలివరీ వరకు ఆన్‌లైన్ పర్యవేక్షణ

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నమోదు, వినియోగదారుల రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ బుకింగ్, ట్యాంకర్ కేటాయింపు, జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, డెలివరీ నిర్ధారణ వంటి సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేయాలని ఎండీ సూచించారు. సొంత ట్యాంకర్లు కలిగిన వినియోగదారులు కూడా నిర్దేశిత నిబంధనల మేరకు ఈ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ట్యాంకర్లు లేని వినియోగదారులకు జలమండలిలో నమోదైన ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం

నిర్మాణ పనులు, మొక్కల పెంపకం, పార్కుల నిర్వహణ, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ వంటి అవసరాలకు తాగునీరు, భూగర్భ జలాలను వినియోగించకుండా శుద్ధి చేసిన నీటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎండీ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, పారిశ్రామిక సంఘాలతో సమన్వయం చేసుకొని గ్రీన్ వాటర్ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు.

నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ

గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లలో శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని ఎండీ ఆదేశించారు. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, శుద్ధి చేసిన నీటిని తాగునీరు అవసరం లేని పనులకు మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రీన్ వాటర్ వినియోగంపై విస్తృత ప్రచారం

గ్రీన్ వాటర్ సేవలపై నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఎండీ సూచించారు. బుకింగ్ విధానం, ఫిల్లింగ్ స్టేషన్ల వివరాలు, శుద్ధి చేసిన నీటి వినియోగ ప్రయోజనాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక, నిర్వహణ ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us