Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో 32 బస్తీ దవాఖానాలు.. పూర్తి వివరాలు

Hyderabad News: జంట నగరాల్లోని ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతంకానుంది. ఆ దిశగా జిహెచ్ఎంసి చర్యలు తీసుకుంటోంది.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో 32 బస్తీ దవాఖానాలు.. పూర్తి వివరాలు
Basti Dawakhana in Hyderabad
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 27, 2021 | 5:20 PM

Hyderabad News: జంట నగరాల్లోని ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతంకానుంది. ఆ దిశగా జిహెచ్ఎంసి చర్యలు తీసుకుంటోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే బీద ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో ఇప్పటి వరకు 226 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో త్వరలో మరో 32 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో వీటిని ప్రారంభించే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీ పరిధిలో గల కమ్యూనిటీ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు ప్రజలు విశేష స్పందన వస్తున్న నేపథ్యం లో మరో 32 దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం 300 వరకు బస్తీ దవాఖాన ఏర్పాటు కు నిర్ణయించగా యుద్ద ప్రాతిపదికన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇంకా వివిధ ప్రదేశాల్లో భవనాల సేకరణ, గుర్తింపు పూర్తయిన తర్వాత మరిన్ని బస్తీ దవఖానాల ఏర్పాటుకు జిహెచ్ఎంసి కసరత్తు చేస్తున్నది. భవనాలను గుర్తించిన తర్వాత బస్తీ దవాఖాన నిర్వహణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటు ద్వారా వైద్య ఖర్చులు తగ్గి పేదల ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

త్వరలో ప్రారంభించనున్న బస్తీ దవాఖానల వివరాలు లలిత బాగ్ (36) వార్డులో కొనైన మాజిద్ ఫతేశ నగర్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా రియసాత్ నగర్ (40) కమ్యునిటీ భవన్, కంచన్ బాగ్ (41) వార్డులో మజీద్ ఇ ఒమర్ ఫారూఖి సి బ్లాక్ వైపు క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్, నవాబ్ సాహెబ్ కుంట(47) లోని అచ్చిరెడ్డినగర్ కమ్యునిటీ హాల్, రామ్ నాస్ పుర, చిరాగల్లీ నగర్ కమ్యునిటీహాల్, టోలిచౌకి (68) రేషంబాగ్ ఓవైసి కమ్యునిటీహాల్, పురానాపూల్ (52) జలాల్ కుంచ కమ్యునిటీహాల్ (వార్డు ఆఫీస్), చవాని బాగ్ ఇ జహ్రా కమ్యునిటీహాల్, రెయిన్ బజార్ (31) ముర్తుజానగర్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్, ఖైరతాబాద్ (91) మహాభారత్ నగర్ కమ్యునిటీ హాల్, షేక్ పేట్ (94) రాజీవ్ గాంధీనగర్ కమ్యునిటీహాల్, జూబ్లీహిల్స్ (95/92) సింగడి బస్తీ కమ్యునిటీహాల్, గోషామహల్ (51) దూల్ పేట్ చంద్రకిరణ్ బస్తీ కమ్యునిటీహాల్, మల్లేపల్లి (76) జకీర్ హుస్సేన్ కమ్యునిటీహాల్, గోల్నాక (82) కమగారినగర్ కమ్యునిటీహాల్, యూసుఫ్ గూడ (96) యూసుఫ్ గూడ కమ్యునిటీహాల్, బన్సిలాల్ పేట్ (147) హమాలీబస్త కమ్యునిటీహాల్, నాచారం (6) అన్నపూర్ణ కాలనీ కమ్యునిటీహాల్, చిలుకానగర్ (7) బీరప్పగడ్డ రామాలయం దగ్గర కమ్యునిటీహాల్, అబ్సీగూడ (8) రామంతపూర్ జెడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, ఓల్డ్ బోయిన్ పల్లి (119) ఓల్డ్ బోయిన్ పల్లి వార్డు ఆఫీస్, బాలానగర్ (120) ఫిరోజ్ గూడ వార్డు ఆఫీస్, చింతల్ (128) ఎన్.ఎల్.బి కమ్యునిటీహాల్, సుభాష్ నగర్ (130) అపురూపకాలనీ కమ్యునిటీహాల్, మచ్చబొల్లారం కౌకూర్ మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. వెంకటాపురం (135) గోకుల్ నగర్ పార్కు, నేరెడ్ మెట్ చెక్ పోస్ట్ కమ్యునిటీహాల్ యాప్రాల్, గౌతం నగర్ (141) ఓల్డ్ మిర్జల్ గూడ శ్రీనివాసనగర్ కమ్యునిటీహాల్, హైదర్ నగర్ (123) వార్డు ఆఫీస్ హైదర్ గూడ, శేరిలింగంపల్లి (106) ముస్లీం బస్తీ నెహ్రూనగర్ కమ్యునిటీహాల్, చందానగర్ (110) పాపిరెడ్డి కమ్యునిటీహాళ్లలో ఏర్పాటు చేయనున్నారు.

బస్తీ దవాఖానాల ఏర్పాటుతో నగరంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతంకానుంది. కరోనా పాండమిక్ వంటి సందర్భాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.

Also Read..

New Variant Corona: దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌.. గుర్తించిన వైద్యులు.. అక్కడ ఏడు కేసులు నమోదు..!

Ananya Drugs Case: జస్ట్‌ జోక్‌ చేశా.. ఆర్యన్‌కు డ్రగ్స్‌ సరఫరా పై అనన్య రిప్లై..! వైరల్ గా మారిన వీడియో..