Hyderabad Water Supply Alert : హైదరాబాద్ లో మంచినీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే.

వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్‌ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి

Hyderabad Water Supply Alert : హైదరాబాద్ లో మంచినీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే.
నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో తాగునీటి సమస్యపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు అదనంగా మంజూరు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 16, 2021 | 8:38 PM

Hyderabad Water Supply Alert : వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్‌ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో వాటర్‌బోర్డ్‌ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు బస్తీలు, కాలనీలలో ఇప్పటికే నీటి సమస్య ఎదురవుతూనే ఉంది. ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా కు చాలా కష్టం అవుతుంది. పలు కాలనీలకు, బస్తీలకు వాటర్‌ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఇదిలా ఉంటే నాగోల్ బ్రిడ్జి వ‌ద్ద జ‌ల‌మండ‌లి 1600 ఎంఎం డ‌యా రింగ్ మెయిన్ పైపులైన్ విస్త‌ర‌ణ మ‌రియు మ‌ర‌మ్మ‌త్తుల ప‌నులు చేప‌డుతున్న కార‌ణంగా తేది: 18.03.2021 గురువారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది: 19.03.2021 శుక్ర‌వారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఈ ప‌నుల‌ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

మ‌న్సూరాబాద్, నాగోల్, ఆర్.కే. పురం, చైత‌న్య‌పురి, మారుతీన‌గ‌ర్, కొత్త పేట్, చిల్క‌న‌గ‌ర్, ఉప్ప‌ల్ ప్రాంతాలు మ‌రియు పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్. కాబ‌ట్టి నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌ల‌గనున్న ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదదవండి : ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!

డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..

బెంగాల్ ఎన్నికలు , పురూలియాలో బీజేపీ ‘రథ వాహనం’ ధ్వంసం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనని కమలనాథుల ఆరోపణ

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.