Hyderabad: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. తాగి పట్టుబడితే ఇక అంతే.. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత..
Hyderabad New Year celebrations: హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. నగరంలో వేళ్లూనుకుపోయిన డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా మత్తు పదార్ధాలు సప్లై చేస్తోంది. ఇప్పుడు న్యూఇయర్ వేడుకలు దగ్గర పడటంతో భారీ మొత్తంలో డ్రగ్స్ డంప్ చేశారు. హైదరాబాద్‌లో కేవలం 24 గంటల్లోనే నాలుగు చోట్ల డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు.
Hyderabad New Year celebrations: హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. నగరంలో వేళ్లూనుకుపోయిన డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా మత్తు పదార్ధాలు సప్లై చేస్తోంది. ఇప్పుడు న్యూఇయర్ వేడుకలు దగ్గర పడటంతో భారీ మొత్తంలో డ్రగ్స్ డంప్ చేశారు. హైదరాబాద్‌లో కేవలం 24 గంటల్లోనే నాలుగు చోట్ల డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్, ఫిలింనగర్, చైతన్యపురిలో డ్రగ్స్ ముఠాలు పోలీసులకు చిక్కారు. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నిల్వ ఉన్నాయనే సమాచారంతో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తు్న్నారు అధికారులు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైఅలర్ట్ విధించారు. స్నిఫర్ డాగ్స్‌తో పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. పాత నేరస్థులపై టినాబ్ నిఘా పెంచింది. ఇప్పటికే పాత నేరస్థులు పోలీసులకు పట్టుబడుతున్నారు. అంతేకాకుండా.. పబ్బులు, సినిమా ఇండస్ట్రీపై పూర్తి నిఘా పెట్టారు. డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు టీఎస్ న్యాబ్ సిద్ధం అవుతోంది. డ్రగ్ డ్రాపర్ మెషీన్‌లు మరికొద్ది రోజుల్లో తెప్పించనున్నారు. న్యూ ఇయర్‌లోపు తెచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. లాలాజలం శాంపిల్‌తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలు వస్తాయి.
న్యూఇయర్ వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, పబ్ లు, ఈవెంట్లకు 31 అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ కె. శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ గంజాయ్ వాటితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ముందుగా ఈవెంట్ లు నిర్వహించే హోటళ్లు, పబ్బుల యజమానులు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. లిక్కర్ సరఫరాకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. పబ్బులల్లో అశ్లీల నృత్యాలు చేస్తే సహించేది లేదన్నారు. కెపాసిటీకి మించి అనుమతించవద్దని.. పబ్బుల వద్ద సెక్యూరిటీ గార్డులను ఎక్కువగా నియమించుకోవాలని సూచించారు.
అంతేకాకుండా తాగి వాహనాలు నడిపితే.. కఠిన చర్యలు తప్పవన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే.. 10వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని సీపీ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..