Hyderabad: పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. అది విషం కూడా కావొచ్చు

అసలే ఎండాకాలం.. పిల్లలు ఐస్ క్రీం అనగానే వెంటనే కొనిస్తున్నారా..? అయతే ఆగండాగండి. మీ కోసమే ఈ న్యూస్. కల్తీ గాళ్లు రెచ్చిపోతున్నారు. పిల్లలు తినే ఐస్ క్రీమ్ సైతం కల్తీ చేస్తున్నారు. తాజాగా పోలీసులు దాడుల్లో విస్తుపోయే విషయాలు తెలిశాయి.

Hyderabad: పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. అది విషం కూడా కావొచ్చు
Ice Cream (Representative image)
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Apr 14, 2023 | 3:15 PM

యు ఆర్ అటెన్షన్ ప్లీజ్.. ఇంట్లో ఐస్ క్రీమ్‌.. ఐస్‌ క్రీమ్ అంటూ పిల్లలు మారం చేస్తున్నారా.. అదే పనిగా మీరు వెళ్లి షాప్‌లో అందమైన ప్యాకింగ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌ కొనిస్తున్నారా.. హమ్మయ్య అంటూ ఆ నిమిషానికి ఊపిరి పీల్చుకున్నారా.. అప్పటికీ మీకు ఊరట లభించవచ్చు కాని.. పిల్లాడికి మీరు ఇచ్చింది ఐస్‌ క్రీమ్‌ కాదు.. విషం.. పూర్తి డీటేల్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరిచిపోక ముందే నకిలీ ఐస్‌క్రీమ్స్‌ బయటపడ్డాయి. నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్.ఓ.టీ. మాదాపూర్ పోలీసులు దాడి చేసి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు సంవత్సరాలుగా ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు శ్రీనివాస రెడ్డి. ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రంపై దాడులు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు.. పది లక్షల రూపాయల విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.

నిన్న మనం హైదరాబాద్‌ శివారులోనే నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రం గుట్టురట్టైన విషయం చూశాం. రాజేంద్రనగర్‌ పరిధి సులేమాన్‌నగర్‌లో SOT పోలీసులు జరిపిన దాడుల్లో దిమ్మదిరిగే విషయాలు వెలుగుచూశాయి. చాక్లెట్ల తయారీలో హానికర కెమికల్స్‌ గుర్తింంచారు. లీటర్ల కొద్దీ కెమికల్ బాటిల్స్‌, రంగు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గ్లూకోజ్‌‌ లిక్విడ్, సిట్రిక్‌‌ యాసిడ్‌‌ పౌడర్, ఆరెంజ్‌‌ లిక్విడ్‌‌ ప్లేవర్, పాలిష్‌‌ పౌడర్, స్వీట్‌‌ ఆయిల్‌‌ లాంటి కెమికల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారైన చాక్లెట్లను బేగంబజార్‌‌లో హోల్‌‌సేల్‌‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సిటీలోని అనేక చిన్నషాపులకు సరఫరా అవుతున్నాయి ఈ చాక్లెట్స్. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకూ సప్లై జరుగుతోంది.

నిన్న నకిలీ చాక్లెట్లు.. ఇవాళ నకిలీ ఐస్‌క్రీమ్‌లు. నగరంలో ఏం జరుగుతోంది? జనం ప్రాణాలతో చెలగాటమే వ్యాపారమా? ఏళ్ల తరబడి సాగుతున్న వ్యాపారం అధికారులకు కనిపించడం లేదా? గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందా? గుట్టు తెలిసినా.. మాముళ్ల మత్తులో జోగుతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.