Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేష్ లడ్డుకు భలే డిమాండ్.. భారీ ధర పలికిందోచ్..

బాలాపూర్‌లో లడ్డూ మళ్లీ రికార్డ్‌ సృష్టించింది. 18లక్షల 90వేల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి ఈసారి వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. నువ్వా..నేనా అన్నట్టు పోటాపోటీగా...

Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేష్ లడ్డుకు భలే డిమాండ్.. భారీ ధర పలికిందోచ్..
Balapur Ganesh Laddu Auctio
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 19, 2021 | 10:45 AM

బాలాపూర్‌లో లడ్డూ మళ్లీ రికార్డ్‌ సృష్టించింది. 18లక్షల 90వేల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ ఈసారి వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. నువ్వా..నేనా అన్నట్టు పోటాపోటీగా సాగిన వేలంలో మర్రి శశాంక్‌ రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి. గతేడాది 17లక్షల 60వేల రూపాయల ధర పలకగా..ఈసారి 18లక్షల 90వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు మర్రి శశాంక్‌రెడ్డి.

గణేష్‌ బప్పా.. మోరియా.. ఆదా లడ్డూ తేరా..! అవును.. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం.. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు. 26 ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న బాలాపూర్‌ గణేశుడు.. ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకేత్తించింది.

గతేడాది కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దు చేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ.. రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఈసారి కూడా అదే స్థాయిలో పలకవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది. ఉత్సవసమితి ఆధ్వర్యంలో 9 రోజులపాటు విశేష పూజలందుకున్న బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలం ఈ యేడాది మరింత జోరుగా జరగనుంది. 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట..వందలు వేలు దాటి..రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలంపాట నువ్వా..నేనా అన్నట్లుగా కొనసాగుతుంది.

గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్‌ గణేష్‌ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. 2020లో కరోనా కారణంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లడ్డూవేలం పాటను రద్దు చేశారు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్‌కు ఆ లడ్డూను అందజేశారు. ఐతే రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ఎంతో ఆసక్తి రేపుతోంది.

2019లో రికార్డుస్థాయిలో బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో 17లక్షల 60వేల రూపాయలకు కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నారు. 2016లో మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్‌ రెడ్డి 14లక్షల 65 వేలకు దక్కించుకున్నారు. 2017లో తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్‌గుప్తా 16లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు.

ఈ యేడాది బాలాపూర్‌ గణేశుడి లడ్డూవేలాన్ని ఘనంగా నిర్వహించాలని ఉత్సవసమితి నిర్ణయించింది. ఇప్పటివరకూ లడ్డూవేలం పాటలో పాల్గొన్న 18 మంది శాశ్వత సభ్యులు, లడ్డూ దక్కించుకున్న స్థానికేతరులను ఉత్సవసమితి సత్కరించింది. లడ్డూవేలంపాటకు స్థానికులతోపాటు బయటి నుంచి ఆరుగురు వ్యక్తులు వేలంపాటకి ఆసక్తి కనబరిచారు. వారంతా రెండువేలరూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2019లో 17లక్షలు దాటిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈసారి 20 లక్షలు పలకవచ్చని ఉత్సవసమితి సభ్యులు అంచనా వేస్తున్నారు.

41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్‌ గణపతి నిమజ్జన వేడుకలు ఈ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ పూర్తిచేసుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్​పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. 9 గంటలకు గణపతి ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే వేలంపాట కొనసాగుతుంది. వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తిని సన్మానించిన తర్వాత ..ట్యాంక్‌బండ్‌ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి: Khairatabad Ganesh Nimajjanam: ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్న మహా గణపతి.. సందడిగా మొదలైన శోభాయత్ర..

Ganesh Nimajjanam Puja: యధాస్థానం ప్రవేశయామి.. తొమ్మిది రోజుల పూజల తర్వాత.. గణేశుడిని ఇలా నిమజ్జనం చేయండి..

Ganesh Nimajjanam: మహానగరంలో మహోత్సవం.. ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్న గణనాథులు

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి.. 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..