Ganesh Nimajjanam Puja: యధాస్థానం ప్రవేశయామి.. తొమ్మిది రోజుల పూజల తర్వాత.. గణేశుడిని ఇలా నిమజ్జనం చేయండి..

How to Perform Ganesh Nimajjanam: చవితి నుంచి రెండు పూటలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. తొమ్మిదో రోజున ఉద్వాసన చెప్పి.. గణనాథునికి నిమజ్జనం చేస్తారు. ‘యధాస్థానం ప్రవేశయామి..

Ganesh Nimajjanam Puja: యధాస్థానం ప్రవేశయామి.. తొమ్మిది రోజుల పూజల తర్వాత.. గణేశుడిని ఇలా నిమజ్జనం చేయండి..
Ganesh Nimajjanam Puja
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2021 | 10:29 AM

పంచభౌతికమైన ప్రతి పదార్ధం.. అంతిమంగా ప్రకృతిలో కలిసిపోవాల్సిందే! అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడిని మట్టితోనే చేసి.. నీటిలో నిమజ్జనం చేస్తారు. వినాయకుడిని భక్తిశ్రద్దలతో కొలవడమే కాదు.. అంతే భక్తితో నిమజ్జనం చేయాలి. నృత్య గీతాలు ఆలపిస్తూ గంగమ్మ ఒడిలో చేర్చాలి. పంచభూతాల్లో భూమి ఒకటి… అందుకే మట్టి విగ్రహాలు, అందులోనూ కొత్త మట్టి విగ్రహాలు చేయడం…సర్వమానవాళి సుఖసంతోషాలకు మూలంగా చెబుతుంటారు. గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడంలో విశేషముంది. భాద్రపద మాసంలో భూమి తల్లి.. జలకళతో ఉట్టి పడుతుంది. జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాల్లోకి దిగి.. మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. తద్వారా నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి.

బంకమట్టితో వినాయక ప్రతిమలు చేసి.. 21 రకాల పత్రాలతో పూజిస్తారు. దాని వల్ల ఆ పత్రాల్లోని ఔషధ గుణాలు నీటిలో ఉండే క్రిమికీటకాలను చంపుతాయన్నది నిమజ్జనం వెనకున్న అసలు రహస్యం. ఆ నీటిని మంచినీటి రూపంలో తాగడం ద్వారా.. అవి మన శరీరంలోకి చేరి.. ఆరోగ్యాన్ని అందిస్తాయని పెద్దలు, ఆయుర్వేద వైద్యులు చెబుతారు.

చవితి నుంచి రెండు పూటలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. తొమ్మిదో రోజున ఉద్వాసన చెప్పి.. గణనాథునికి నిమజ్జనం చేస్తారు. ‘యధాస్థానం ప్రవేశయామి.. పూజార్థం పునరాగమనాయచ’ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి. దీని అర్థం ‘స్వామి.. నీ స్వస్థలానికి వెళ్లి.. మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు’ అని అర్ధం.

ఆ తర్వాత పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి దారంతో కంకణం చేసుకుని.. చేయికి కట్టుకోవాలి. ఆ తర్వాత నిమజ్జనానికి పూనుకోవాలి. ఇంటి దగ్గర నదీ కాలువ లేదంటే చెరువులో నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసే ముందు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేసేటపుడు.. విగ్రహాన్ని విసిరివేయకూడదు. రెండు చేతులతో పట్టుకుని చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేయాలి.

ఇంట్లోని ఏదైనా తొట్టెలో నిమజ్జనం చేస్తుంటే.. తొట్టి కింద ముందు ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు చల్లి.. దానికి నమస్కారం చేసి.. వినాయక విగ్రహన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసేటపుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. బకెట్‌ లేదా తొట్టెలో నిమజ్జనం చేస్తే.. ఆ నీటిని ఏదైన మారేడు, రావి చెట్టుకు పోయాలి.

ఇవి కూడా చదవండి: AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి.. 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..