Hyderabad: హైదరాబాదులో అరుదైన శస్త్ర చికిత్స.. 20 గంటలపాటు సర్జరీ చేసి 50 కిలోల కణజాలం తొలగింపు

హైదరాబాదులో మెడికోవర్ హాస్పిటల్ మరో ఘనత సాధించింది. 20 గంటలపాటు సుధీర్గంగా సర్జరీ చేసిన అనంతరం సోమాలియా దేశానికి చెందిన బాలిక ఆరోగ్యం కుదుటపడింది. సుమాలియా దేశానికి చెందిన 18 సంవత్సరాల బాలికకు అరుదైన వ్యాధి సోకింది. తన శరీరంలో పేరుకుపోయిన శోషరస కణజాలాన్ని శస్త్ర చికిత్స ద్వారా మేడికోవర్ వైద్యులు తొలగించారు. దాదాపు 50 కిలోల కణజాలాన్ని సర్జరీ ద్వారా బయటికి తీశారు. ఇందుకోసం మెడికోవర్ వైద్యులు 20 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. సుమారు 50 కిలోల బరువున్న కణజాలాన్ని బాలిక ఎడమకాలిలో పేరుకుపోయినట్టు వైద్యులు..

Hyderabad: హైదరాబాదులో అరుదైన శస్త్ర చికిత్స.. 20 గంటలపాటు సర్జరీ చేసి 50 కిలోల కణజాలం తొలగింపు
Lymphatic Tissue Removed From A Girl From Somalia

Updated on: Nov 09, 2023 | 5:26 PM

హైదరాబాదు, నవంబర్‌ 9: హైదరాబాదులో మెడికోవర్ హాస్పిటల్ మరో ఘనత సాధించింది. 20 గంటలపాటు సుధీర్గంగా సర్జరీ చేసిన అనంతరం సోమాలియా దేశానికి చెందిన బాలిక ఆరోగ్యం కుదుటపడింది. సుమాలియా దేశానికి చెందిన 18 సంవత్సరాల బాలికకు అరుదైన వ్యాధి సోకింది. తన శరీరంలో పేరుకుపోయిన శోషరస కణజాలాన్ని శస్త్ర చికిత్స ద్వారా మేడికోవర్ వైద్యులు తొలగించారు. దాదాపు 50 కిలోల కణజాలాన్ని సర్జరీ ద్వారా బయటికి తీశారు. ఇందుకోసం మెడికోవర్ వైద్యులు 20 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. సుమారు 50 కిలోల బరువున్న కణజాలాన్ని బాలిక ఎడమకాలిలో పేరుకుపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఏడు సంవత్సరాలుగా తన ఎడమకాలు పూర్తిగా ఉబ్బి పోయింది. రకరకాల వైద్యులను కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరిగా హైదరాబాద్ కు వచ్చిన బాలికకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసి కణజాలాన్ని తొలగించారు.

తన వ్యాధిని నయం చేయాలని వివిధ దేశాలలో బాలిక పలు హాస్పిటల్స్ ను సందర్శించింది. కానీ తన వ్యాధికి ట్రీట్మెంట్ మాత్రం దొరకలేదు. ఎట్టకేలకు మేడికోవర్ హాస్పిటల్ లో ఉన్న వాస్కులర్ డిపార్ట్మెంట్ కు బాలికను సిఫారసు చేశారు. మెడికవర్ లో బాలికకు అనేక టెస్టులు చేసిన తర్వాత (lymphedema nostrus verrucosa) వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. ఈ వ్యాధి ద్వారా శరీరంలోని కొన్ని అవయవాలు పెద్దగా అయిపోవడం సంభవిస్తుంది.. సోమాలియా బాలిక కేసులో బాలిక ఎడమకాలు పూర్తిగా ఉబ్బిపోయ్యింది. గత ఏడు సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధితురాలు బాధపడుతూనే ఉంది. చివరి మూడు సంవత్సరాలపాటు తాను నరకం చూసినట్టు బాధితురాలు తెలిపింది.

ఈ వ్యాధి సోకిన వెంటనే శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా వ్యక్తి యొక్క జీవన విధానంపై దీని ప్రభావం చూపుతుంది. ఒబేసిటీ తోపాటు పలు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. దీని ద్వారా శరీరంలోని అవయవాలు భారీగా వుబ్బడం మొదలవుతుంది. హాస్పిటల్ కి వచ్చిన బాలికకు మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ , సర్జికల్ విధానాన్ని వైద్యులు అవలంబించారు. సర్జికల్ విభాగం మొత్తాన్ని డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ అలీ అహ్మద్ చూసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ టీం తో కలిసి ఈ సర్జరీని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.