HRC: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై HRC సీరియస్.. సీఎస్‌తో పాటు పలువురికి నోటీసులు!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17మంది స్థానికులు మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనపై HRC(హ్యూమన్ రైట్స్ కమిషన్) సీరియస్ అయ్యింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.

హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో 17 మంది స్థానికులు మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు, నలుగురు మహిళలు, ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అయితే వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కేంద్రం కూడా బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.
అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనపై తాజాగా మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై HRC సీరియస్ అయ్యింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హూదరాబద్ సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు HRC నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ఘటన పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
