AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముక్కు, చెవులు కోసి మహిళ దారుణ హత్య.. కేసును చేధించిన పోలీసులు..

హైదరాబాద్‌ శివారులో ఓ మహిళ దారుణ హత్య సంచలనం రేపింది. నో డౌట్.. నగల కోసమే దాడి చేశారు.. చంపేశారు.. మూడు రోజుల దర్యాప్తు తర్వాత పోలీసులు కూడా అదే తేల్చారు. ఇంతకీ ఎవరా హంతకుడు? హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు?

Telangana: ముక్కు, చెవులు కోసి మహిళ దారుణ హత్య.. కేసును చేధించిన పోలీసులు..
Medchal Murder Case
Ram Naramaneni
|

Updated on: May 19, 2025 | 7:21 PM

Share

మేడ్చల్‌ శివారు అత్వెల్లి గ్రామంలో ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. చెవిదిద్దుల కోసమే ఓ యువకుడు కిరాతకానికి ఒడిగట్టినట్టు తేల్చారు.

సగానికి పైగా కాలిన మహిళ మృతదేహం

మూడు రోజుల క్రితం అత్వల్లిలోని ఓ రేకుల షెడ్‌ నుంచి  మంటలు రావడం గమనించిన స్థానికులు మేడ్చల్‌  పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే మహిళ మృతదేహం సగానికి పైగా కాలిపోయింది. మృతురాలు వికారాబాద్‌కు చెందిన లక్ష్మీగా గుర్తించారు. లక్ష్మీ ఓ వైన్‌ షాప్‌లో రోజువారి కూలీగా పనిచేసేది. ఏం జరిగిందో తెలియదు.. సడెన్‌గా హత్యకు గురయింది.

ఒంటిపై నగలను గమనించిన రాకేష్

కూలి పనులు చేసే రాకేష్‌.. తల్లితో కలిసి దిల్‌షుఖ్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే కిష్టాపూర్‌లో మద్యం తాగుతున్న సమయంలో లక్ష్మీ కంటపడింది. ఒంటిపై నగలు ఉండటంతో ఎలాగైనా వాటిని కొట్టేయాలని ప్లానేశాడు. ఆమెకు బాగా మద్యం తాగించాడు. నిద్రలోకి జారుకుందని భావించి.. నగలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే లక్ష్మీ ప్రతిఘటించడంతో గొంతుకోశాడు. ముక్కు చెవి భాగాలను కత్తిరించి బంగారంతో ఉడాయించాడు. వెళ్తూ వెళ్తూ డెడ్‌బాడీకి నిప్పుంటించాడు.

మర్డర్‌ మిస్టరీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ తిరగేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఐదు గ్రాముల ముక్కుపుడకలు, 60గ్రాముల వెండి కడియాలు, బ్రాస్‌లెట్‌, ఉంగరంతో పాటు 3,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల్ని ఎవరూ నమ్మొద్దని.. అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..