ఏందయ్యా ఇది.! ఏది కొనలేం.. ఏది తినలేం.. చికెన్‌తో పోటీపడుతోన్న కూరగాయల ధరలు..
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీపడుతున్నాయి. నిన్నటి వరకు కారు చవకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజారులోనే కిలో రూ. 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో అయితే, రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. ఆ వివరాలు..
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీపడుతున్నాయి. నిన్నటి వరకు కారు చవకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజారులోనే కిలో రూ. 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో అయితే, రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. బీన్స్ అయితే రూ. 200 దాటేసింది. బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి. రైతు బజార్లలో గుండుబీన్స్ కిలో రూ. 155 లు, గింజ చిక్కుడు రూ. 85, పచ్చకాకర రూ. 55, బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 50 లు పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర చిన్నకట్ట పది రూపాయలకు విక్రయిస్తున్నారు.
సాధారణంగా హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ. 2800 టన్నులకు అటూఇటుగా వస్తున్నాయి. మామూలుగా అయితే నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయాలు అవసరం. ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఇది చదవండి: మీకు రేషన్ కార్డు ఉందా.? ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ. 5 వేలు మీ సొంతం.!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..