- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma, KL Rahul, Virat Kohli In List, Star Players Set To Be In IPL 2025 Mega Auction, Details Here
కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..
ఐపీఎల్ 2024 ముగిసింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో నిలకడైన ఆటతీరు కనబరిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కప్పు గెలుస్తుందనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ స్టెప్‌పై తేలిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫ్రాంచైజీల అందరి దృష్టి ఐపీఎల్ 2025..
Updated on: May 28, 2024 | 12:48 PM

ఐపీఎల్ 2024 ముగిసింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో నిలకడైన ఆటతీరు కనబరిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కప్పు గెలుస్తుందనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ స్టెప్‌పై తేలిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫ్రాంచైజీల అందరి దృష్టి ఐపీఎల్ 2025 మెగా వేలంపై పడింది.

రిటైన్‌కి కేవలం 4గురు నుంచి 6గురు ప్లేయర్స్ మాత్రమే ఉండాలని బీసీసీఐ రూల్ పెట్టిందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మెగా వేలంలోకి స్టార్ ఆటగాళ్లు సైతం రానున్నారు. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి.

కెప్టెన్సీ కోల్పోయిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మతో పాటు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కెఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు మెగా వేలంలోకి రానున్నట్టు సమాచారం. అలాగే ఈ ఆటగాళ్లను దక్కించుకునేందుకు పలువురు ఫ్రాంచైజీల ఓనర్లు మొగ్గు చూపిస్తున్నారట.

అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వచ్చే ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ రిటైన్ లిస్టులో ఉండనున్నారట.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, అక్ష్‌దీప్‌లను వదిలించుకుంటుందని తెలుస్తోంది.





























