- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Virat Kohli Likely To Miss India's Warm Up Match Vs Bangladesh Due To This Reason
T20 World Cup 2024: టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం! అందుకే బంగ్లాతో వార్మప్ మ్యాచ్ కు దూరమయ్యాడా?
024 టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా లో ల్యాండ్ అయ్యింది. తొలి బ్యాచ్‌లో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితర ఆటగాళ్లు న్యూయార్క్ లో అ డుగుపెట్టారు.
Updated on: May 28, 2024 | 9:52 PM

2024 టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా లో ల్యాండ్ అయ్యింది. తొలి బ్యాచ్‌లో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితర ఆటగాళ్లు న్యూయార్క్ లో అ డుగుపెట్టారు.

రెండో బ్యాచ్‌లో మిగతా ఆటగాళ్లు అమెరికా వెళ్లనున్నారు. అయితే ఈ రెండు బ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ మాత్రమే అమెరికా వెళ్లడం అనుమానమే అని అంటున్నారు. నిజానికి కోహ్లి కూడా తొలి బ్యాచ్‌లోనే అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా కోహ్లి జట్టులోకి వస్తున్నట్లు సమాచారం.

మీడియా నివేదికల ప్రకారం, IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ నుండి RCB నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే తన విరామం పొడిగించాలని కోహ్లి బీసీసీఐని అభ్యర్థించాడు. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవించి, కోహ్లీ అమెరికా వెళ్లే తేదీని పొడిగించినట్లు సమాచారం.

వీలైనంత త్వరగా కోహ్లీ జట్టులో కలుస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. విరాట్ అభ్యర్థనను బీసీసీఐ గౌరవించిందని, ఇందులో భాగంగానే అతని వీసా అపాయింట్‌మెంట్ తేదీని కూడా పొడిగించారని బీసీసీఐ తెలిపింది.

నివేదికల ప్రకారం మే 30 నాటికి విరాట్ న్యూయార్క్ బయలుదేరవచ్చు. అంటే బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చు.

2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే మే 30న విరాట్ న్యూయార్క్ వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే జూన్ 5న ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశం ఉంది.





























