Child Trafficking: అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు.. హైదరాబాద్‌ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో సంచలన నిజాలు

తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ సీక్రెట్‌ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Child Trafficking: అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు.. హైదరాబాద్‌ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో సంచలన నిజాలు
Child Trafficking
Follow us
Balaraju Goud

|

Updated on: May 29, 2024 | 11:12 AM

పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చెల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని చెందించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13మంది పిల్లలను రక్షించి 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు.. కొంతమంది కేటుగాళ్లు. పీర్జాదిగూడలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్‌ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు.

తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ సీక్రెట్‌ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ మహానగరంలోని మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారన్న సమాచారంతో రాచకొండ పోలీసులు రెయిడ్ చేశారు. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. RMP శోభారాణి, సలీం, స్వప్న అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసి మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం గుట్టురట్టు చేశారు. దీనికి వెనుక ఉన్న మాఫియాను బయటపెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

పేద కుటుంబంలోని పిల్లలే టార్గెట్‌గా దందా సాగుతోంది. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి పోషించడం మీకు భారమంటూ తల్లులకు చెప్పి.. మానవత్వంతో పిల్లలు లేని వారికి దత్తత ఇస్తామంటూ నమ్మించి వారి నుంచి 50వేల రూపాయలకు చిన్నారులను కొనుగోలు చేసిన ముఠా.. వారిని పిల్లలు లేని తల్లిదండ్రులకు లక్షా 80 వేల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఢిల్లీ, పూణే నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తుంటే, కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం. పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు.

ఎవరికైనా పిల్లలు లేకపోతే, దత్తత తీసుకోవాలనిపిస్తే, చట్టబద్ధంగా తీసుకోవాలి. అంతేగానీ ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..