Ant Egg Fry : చీమల గుడ్లతో ఫ్రై.. వాళ్ల ఆరోగ్య రహస్యం ఇదేనట.. అనాదీ ఆచారాన్ని వదలని ఆదివాసీలు!
అధుని యుగంలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోని వలస ఆదివాసీలు బాహ్య ప్రపంచానికి దూరంగా తమ సాంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తూ వస్తున్న వీరి జీవన శైలి భిన్నంగానే ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అందుకే నేమో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.

ఇప్పటికీ అడవుల్లో దొరికేటువంటి చీమలు పెట్టే గుడ్లను సేకరించి కూరగా వండుకుని తింటున్నారు ఇక్కడ ఆదివాసీలు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీ పరిధిలోని అడవిలో ఉన్న కోయగట్టు గుంపులో ఆదివాసీలు వేసవికాలం వచ్చిందంటే వాగుల పక్కనున్న చెట్లపై ఉండే చెదలే వారి ఆహారం. ముఖ్యంగా మామిడి చెట్లపై పులి చీమల ఆకులను గూళ్ళుగా ఏర్పరచుకుని గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ చీమలు పెట్టిన గుడ్లను గిరిజనులు సేకరించి అడవిలో దొరికే బౌద్ధం కూరతో కలిపి వండుకుని తింటారట.
వీడియో చూడండి…
ఇలా వండుకున్న కూర రుచిగా ఉంటుందని కూర తినడం వల్ల ఆరోగ్యంగా, బలంగా ఉంటామని చెబుతున్నారు అదివాసీలు. దీంతో జలుబు, దగ్గు వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కూర వండుకుని తింటామని తెలిపారు. అంతే కాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా సమయంలో కూడా ఈ కూర వండుకుని తినటం వల్ల వ్యాధి బారిన పడకుండా బయట పడ్డామని గిరి పుత్రులు తెలుపుతున్నారు. ఈ గుడ్ల ను సేకరించడంలో అత్యంత చాకచక్యం గా సేకరించవలసి ఉంటుంది. లేదంటే ఆ చీమలు కుడితే తేలు కుట్టి నంత బాధ ఉంటుందంటున్నారు ఆదివాసీలు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…