AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC By Poll: పట్టభద్రుల ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్. ఓటేసేందుకు విద్యావంతుల అనాసక్తి.. కారణం అదేనా!

ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ఓటు వేయడం పౌరుల బాధ్యత ఎన్నికల సంఘం, ప్రజా సంఘాలు నెత్తినోరు.. బాదుకున్న... ఓటర్లు మాత్రం అనాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే సంపన్నులు ఓటుకు దూరంగా ఉండే సంస్కృతి..ఇప్పుడు ఈ జాడ్యం విద్యావంతులకు పట్టుకుంది.

MLC By Poll: పట్టభద్రుల ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్. ఓటేసేందుకు విద్యావంతుల అనాసక్తి.. కారణం అదేనా!
Mlc By Election
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: May 29, 2024 | 10:50 AM

Share

ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ఓటు వేయడం పౌరుల బాధ్యత ఎన్నికల సంఘం, ప్రజా సంఘాలు నెత్తినోరు.. బాదుకున్న… ఓటర్లు మాత్రం అనాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే సంపన్నులు ఓటుకు దూరంగా ఉండే సంస్కృతి..ఇప్పుడు ఈ జాడ్యం విద్యావంతులకు పట్టుకుంది. తాజాగా జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉప ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు విద్యావంతులుగా చెప్పుకునే పట్టభద్రులు బద్ధకస్తులుగా మారి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓట్లు వేయడమే మానేశారు. చైతన్యానికి మారుపేరుగా ఉండాల్సిన పట్టభద్రులు కూడా పోలింగ్ లో పాల్గొనడం లేదు. వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో పోలింగ్‌లో 1.27 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.. ఈ ఓటర్ లందరికీ రాజకీయ అవగాహన, చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో విద్యావంతులు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.05 లక్షల ఓట్లకు గానూ 3.85 లక్షల మంది ఓటర్లు ఓటేయగా..1.19 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో4.63 లక్షల ఓట్లకు గానూ 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఓటేయని వారి సంఖ్య ఇప్పుడు 8 వేలకు పైగా పెరిగినప్పటికీ. ఇంకా 25 శాతానికి పైగా విద్యావంతులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాలేదు. కేవలం పట్టణ ప్రాంతాలకు పరిమితమైందనుకున్న ఓటుకు దూరంగా ఉండే సంస్కృతి.. ఇపుడు పల్లెల్లోని విద్యావంతులకు కూడా పట్టుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 72.44 శాతం ఓటింగ్‌ నమోదు కాగా..నల్గొండ జిల్లాలో 73.29, సూర్యాపేటలో 73.15, యాదాద్రి భువనగిరిలో 78.59 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కున్నారు. మూడు జిల్లాల్లోనూ సగటున మూడు శాతం పోలింగ్‌ ఈ సారి తక్కువ నమోదయింది.

సెలవిచ్చినా కూడా…

విద్యావంతులు పాల్గొనే పట్టభద్రుల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. నియోజక వర్గ వ్యాప్తంగా ఎన్నిక రోజును ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ఈ హాలిడే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. అయినా ఓటు వేయడానికి విద్యావంతులుగా చెప్పుకునే పట్టభద్రులు బద్దకిస్తున్నారు. హాలీడే వచ్చిందని పట్టభద్రుల్లోని ఉద్యోగులు సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. విద్యావంతులుగా కొందరు ఉద్యోగులు, పట్టభద్రులు ఓటింగ్ పై పాల్గొనక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, ఉద్యోగులు ఓటింగ్ పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఓటు నమోదు నుండి వినియోగం వరకు అవగాహన

ఓటు నమోదు నుండి పోలింగ్ వరకు ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టిన విద్యావంతులకు మాత్రం పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటు చైతన్య కార్యక్రమాలతో పాటూ ఎలా ఓటేయాలో జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లతో తెలియజేసినా చాలా మంది పట్టభద్రులు ఓటింగ్‌కు నిరాసక్తత చూపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…