AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆపదలో ఉన్నానంటూ 100కు ఫోన్ చేసిన వ్యక్తి.. పోలీసుల రియాక్షన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

వరంగల్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఊహించలేక షాక్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్క ఎంతకు బయటికి వెళ్ళకపోవడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్కను వారిచేతే బయటకు వెళ్ళగొట్టించాడు. ఈ విచిత్ర సంఘటన ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో జరిగింది. ఇంటి యజమాని రాజేంద్రకుమార్ నిర్వాకం చూసిన పోలీసులు బిత్తరపోయారు.

Telangana:  ఆపదలో ఉన్నానంటూ 100కు ఫోన్ చేసిన వ్యక్తి.. పోలీసుల రియాక్షన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Dial 100 Call For Dog
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: May 29, 2024 | 10:50 AM

Share

వరంగల్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఊహించలేక షాక్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్క ఎంతకు బయటికి వెళ్ళకపోవడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్కను వారిచేతే బయటకు వెళ్ళగొట్టించాడు. ఈ విచిత్ర సంఘటన ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో జరిగింది. ఇంటి యజమాని రాజేంద్రకుమార్ నిర్వాకం చూసిన పోలీసులు బిత్తరపోయారు.

ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడితే సహజంగా కర్ర పట్టుకొని బెదిరిస్తాం. ఏదో ఒక విధంగా ఆ కుక్కను భయపెట్టించి బయటకు వెళ్లగొడతాం. కానీ వరంగల్ గిర్మాజీపేటకు చెందిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి మాత్రం తన ఇంట్లోకి చొరబడ్డ కుక్కని వెళ్ళగొట్టడం కోసం డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్క ఎంతకు బయటికి వెళ్లడం లేదని, తరిమితే పైపైకి వచ్చి కరిచేందుకు యత్నిస్తోంది. మీరే వెళ్లగొట్టాలంటూ పోలీసులకు సూచించడం ఇప్పుడు ఓరుగల్లు హాట్ టాపిక్ అయింది.

వీడియో చూడండి..

గిర్మాజీపేటకు చెందిన కొండపర్తి రాజేంద్రకుమార్ అనేవ్యక్తి ఇంట్లోకి రాత్రి 10 గంటల సమయంలో వీధి కుక్క చొర బడింది.. రాజేంద్రకుమార్ బయటకు వెళ్లెగొట్టే ప్రయత్నం చేయగా.. అరుస్తూ కరవడానికి పైకి రావడంతో భయపడిపోయారు. ఇంట్లోకి దూరిన కుక్కను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎంతకీ ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో, ఇంటి యజమాని రాజేంద్రకుమార్ భయంతో 100కు డయల్ చేశారు. ఈ ఘటన వరంగల్ పోలీసు డివిజన్‌లోని ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధిలో జరిగింది. అప్పటికే సమీప కాలనీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంతేజార్ గంజ్ ఠాణా బ్లూకో‌ల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

విషయం తెలుసుకొని షాక్ అయిన బ్లూ కోల్ట్ టీమ్, ఎట్టకేలకు శ్రమించి ఆ శునకాన్ని బయటకు తరిమికొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కుక్క ఇంట్లోకి వస్తే కూడా మాదేనా బాధ్యత అంటూ పోలీసులు యజమానిని ప్రశ్నించడం వీడియోలో కనిపించింది. ఎంతటి ఆపద వచ్చినా మేముంటాం అనే పోలీసులు, ఆ యాజమానిని గద్దిస్తూ ఈ విషయానికే 100కు డయల్ చేస్తావా అంటూ ఎదురు ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని పలువురు నెటిజన్లు ఖాకీల తీరుపై మండిపడుతున్నారు. దీనిపై బాధితుడు రాజేంద్రకుమార్ స్పందిస్తూ.. ఆపద వేస్తే పోలీసులు సాయం చేస్తారు కదా అంటూ వివరణ ఇవ్వడం పలువురిని ఆలోచింపజేసింది.

ఇటీవల వరుసగా కుక్కల దాడులతో జనం బెంబెలెత్తి పోతున్నారు. ఎందరో పసిపిల్లలు కుక్క కాట్లకు బలైపోయారు. ఈనేపథ్యంలోనే కుక్క కరిచే అవకాశం ఉందని భావించిన రాజేంద్ర కుమార్ డయల్100కు పోన్ కాల్ చేయడం మంచి ఆలోచనే అని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల క్లిక్ చేయండి…