Rain Alert: అలెర్ట్.! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా..
నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిందని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో…యానాంలో రెండు రోజులు పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు…లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమలో సైతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ అధికారులు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ష సూచన చేసింది. రేపటి నుంచి నుండి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరబాద్ లో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట…మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో…పశ్చిమ దిశ నుండి తెలంగాణ వైపు దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి.