Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

హైదరాబాద్‌లో  భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, కొండాపూర్‌, మేడ్చల్‌, దుండిగల్‌, సూరారం, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్‌, సుచిత్ర తదితర ప్రాంతాల్లో..

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
Hyderabad Rains
Follow us
Basha Shek

|

Updated on: Apr 30, 2023 | 9:58 PM

హైదరాబాద్‌లో  భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, కొండాపూర్‌, మేడ్చల్‌, దుండిగల్‌, సూరారం, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్‌, సుచిత్ర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా రాబోయే మూడు గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు కోరారు. కాగా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. కాగా సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే