Telangana: హైదరాబాద్‌లోని అన్ని జోన్లలో కొత్త డివిజన్లు, కొత్త పీఎస్‌లు ఇవే.. హోమంత్రి మహమూద్ అలీ జీవో జారీ..
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీనికోసం పోలీస్ ఉన్నతాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పోలీస్‌స్టేషన్ల పరిధి తగ్గించి, కొత్త పీఎస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అటు అదనపు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
విస్తీర్ణం, జనాభా, కేసుల సంఖ్య ఆధారంగా గతంలో పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. దశాబ్ధాల క్రితం ఉన్న పీఎస్‌ల పరిధిలో ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది. ఫిర్యాదులు, కేసుల సంఖ్య ఎక్కువైపోయింది. రాజకీయ కార్యక్రమాలు, నేతల బందోబస్తులు, ధర్నాలు, ముట్టడిలు, రాస్తారోకోలతో పోలీసులు బిజీ అయ్యారు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు అదనపు పనిభారం, మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్తజోన్‌లు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే జోన్లకు డీసీపీలను కేటాయించారు. జోన్లలో డివిజన్లు, కొత్త పోలీస్‌స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేందుకు సచివాలయం ప్రారంభం సందర్భంగా మొదటి జీవో జారీ చేశారు హోంమంత్రి మహమూద్‌అలీ. రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పోలీస్‌స్టేషన్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా డివిజన్లు, పీఎస్‌లు
- సెంట్రల్‌జోన్ పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు
- సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్
- ఈస్ట్‌జోన్‌పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు
- చిలకలగూడ డివిజన్ పరిధిలో కొత్తగా వారాసిగూడ పీఎస్
- నార్త్‌జోన్‌పరిధిలో తిరుమలగిరి,బేగంపేటడివిజన్, తాడ్‌బంద్ పీఎస్
- సౌత్ఈస్ట్‌జోన్‌పరిధిలో చాంద్రాయణ్‌గుట్ట, సైదాబాద్ డివిజన్లు
సెంట్రల్‌జోన్ పరిధిలో..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. సెంట్రల్‌జోన్ పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపరిధిలో దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. ఈస్ట్‌జోన్ పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. చిలకలగూడ డివిజన్ పరిధిలో వారాసిగూడ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానుంది. నార్త్‌జోన్ పరిధిలోని బేగంపేటడివిజన్, తాడ్‌బంద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. ఇదే జోన్‌లో తిరుమలగిరి డివిజన్‌కు కూడా ఏర్పాటు చేస్తారు. నూతనంగా ఏర్పాటైన సౌత్ఈస్ట్‌జోన్‌పరిధిలో చాంద్రాయణ్ గుట్ట, సైదాబాద్ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.
- వెస్ట్‌సౌత్‌జోన్ పరిధిలో గోల్కొండ డివిజన్, టోలిచౌకీ పీఎస్
- కొత్తగా కుల్సుంపురా డివిజన్, గుడిమల్కాపూర్ పీఎస్ ఏర్పాటు
- సౌత్‌జోన్‌పరిధిలో చత్రినాక డివిజన్ ఏర్పాటు
- వెస్ట్‌జోన్‌పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్‌లో మాసబ్‌ట్యాంక్ పీఎస్..
- రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లి, నాగోల్, గ్రీన్ ఫార్మా సిటీ పీఎస్..
- పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా పీఎస్
- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు
టోలిచౌకీ పీఎస్ నూతనంగా..
వెస్ట్‌సౌత్‌జోన్ పరిధిలో గోల్కొండ డివిజన్, అందులో టోలిచౌకీ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానున్నాయి. కుల్సుంపురా డివిజన్, గుడిమల్కాపూర్ పీఎస్ కొత్తగా రానున్నాయి. సౌత్‌జోన్‌పరిధిలో చత్రినాక డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. వెస్ట్‌జోన్‌పరిధిలో బంజారాహిల్స్ డివిజన్‌లో మాసబ్‌ట్యాంక్, జూబ్లీహిల్స్ డివిజన్, ఫిల్మ్ నగర్ పీఎస్, ఎస్సార్ నగర్ డివిజన్, రహ్మత్‌నగర్ పీఎస్, బోరబండ పీఎస్ కొత్తగా ఏర్పాటు కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లి, నాగోల్, గ్రీన్ ఫార్మా సిటీ పీఎస్, పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా పోలీస్‌స్టేషన్లు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఘట్ కేసర్, జవహార్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ నూతనంగా ఏర్పాటయ్యాయి. అల్లాపూర్, సూరారం, జీనోమ్ వ్యాలీ, అత్తాపూర్, కొల్లూరు, మోకిళ్ల పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి కొత్త సచివాలయం ప్రారంభమైన రోజునే..కొత్త పీఎస్‌ల ఏర్పాట్లకోసం జీవో జారీ చేయడంతో పోలీసుల్లో జోష్ కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం