Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: త‌డిసి ముద్ద‌యిన భాగ్య న‌గ‌రం.. వాహ‌న‌దారులు ఇబ్బందులు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ..

Hyderabad Rains: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. రాత్రి 8 గంట‌ల‌కు మొద‌లైన వ‌ర్షం ఇంకా ప‌డుతూనే ఉంది. ఒక్క సారిగా భారీ వ‌ర్షం కుర‌డంతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. వాహ‌న‌దారులు...

Hyderabad Rains: త‌డిసి ముద్ద‌యిన భాగ్య న‌గ‌రం.. వాహ‌న‌దారులు ఇబ్బందులు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 25, 2021 | 11:51 PM

Hyderabad Rains: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. రాత్రి 8 గంట‌ల‌కు మొద‌లైన వ‌ర్షం ఇంకా ప‌డుతూనే ఉంది. ఒక్క సారిగా భారీ వ‌ర్షం కుర‌డంతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కావ‌డంతో ఎక్క‌డి వాహ‌నాలు, అక్క‌డ నిలిచిపోయాయి. ముఖ్యంగా న‌గ‌రంలోని మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్‌నామా ఇలా న‌గ‌రంలోని దాదాపు అన్ని చోట్ల‌ భారీ వర్షం కురిసింది.

న‌గ‌రంలో అత్య‌ధికంగా మ‌నికొండ‌లో 105 ఎమ్.ఎమ్‌, షేక్‌పేట్‌లో 86 ఎమ్‌.ఎమ్‌, ఫిల్మ్ న‌గ‌ర్‌లో 83 ఎమ్‌.ఎమ్‌, మ‌ల‌క్‌పేట‌లో 69.3 మిల్లీమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. న‌గ‌ర వాసులు ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని కోరారు. రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. కొన్ని చోట్ల చెట్లు కింద ప‌డ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు..

ఇదిలా ఉంటే బంగాళ ఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చ‌డంతో న‌గ‌రంలో ఈ భారీ వ‌ర్షాలు కురిశాయి. ఇక తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపిందే. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఆదివారం సాయంత్రం ఒడిశా తీర ప్రాంతం దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీని ప్ర‌భావంతో ఏపీలోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Also Read: Banana Leaves: అరటి ఆకులతో బంపర్ ఆదాయం.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..

మీరు కదిలే వాహనంలో ఉన్నప్పుడు తొందరగా నిద్రలోకి జారుకుంటారు..! ఎందుకో తెలుసా..?

మేకల పెంపకం దారులకు గమనిక..! ఈ సీజన్‌లో వచ్చే రెండు వ్యాధులు చాలా డేంజర్.. ఏంటో తెలుసుకోండి..