Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరో వైపు వర్షం
Hyderabad: ఒక్కసారిగా వెదర్ ఛేంజ్ అయ్యి వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా.. మధ్యాహ్నానికి ఆకాశం చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది.
ఒక్కసారిగా వెదర్ ఛేంజ్ అయ్యి వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించే పనిలో పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి