రెండు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి.. చల్లల గాలులు వీస్తున్నాయి. దీంతో.. మరో రెండు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య ప్రదేశ్ నుంచి కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉన్న ఉపరితల ద్రోణి వల్ల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అందులోనూ హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయట. ఆదివారం రాష్ట్రంలో 13 చోట్ల […]

రెండు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Alert
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2020 | 4:26 PM

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి.. చల్లల గాలులు వీస్తున్నాయి. దీంతో.. మరో రెండు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య ప్రదేశ్ నుంచి కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉన్న ఉపరితల ద్రోణి వల్ల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అందులోనూ హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయట. ఆదివారం రాష్ట్రంలో 13 చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయని.. నల్గొండలో సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యిందని వెల్లడించారు. మంగళ, బుధ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అకాశముందని అధికారులు తెలిపారు. గాలిలో తేమ సాధారణం కన్నా 28 శాతం అధికంగా ఉందన్నారు అధికారులు.