Covid 19: కరోనా ఎఫెక్ట్: టెకీ ఆఫీస్‌లో ఉద్యోగులకు స్పెషల్ పర్మిషన్..!

హైదరాబాద్‌లో ఓ టెకీకి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Covid 19: కరోనా ఎఫెక్ట్: టెకీ ఆఫీస్‌లో ఉద్యోగులకు స్పెషల్ పర్మిషన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 04, 2020 | 7:38 AM

హైదరాబాద్‌లో ఓ టెకీకి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అతడికి వైరస్ రావడంతో.. ఆ టెకీ పనిచేస్తోన్న బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీ అప్రమత్తమైంది. కంపెనీలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కేటాయించింది. ఒకవేళ కరోనా లక్షణాలున్నాయని అనుమానం వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇక కరోనా బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించిన బస్సులో 12 మంది కర్ణాటక వాసులు ఉన్నారని.. వారంతా బెంగళూరు చేరుకున్నారని కర్ణాటక వైద్య మంత్రి కె సుధాకర్ తెలిపారు.

వారి వివరాలను ట్రాక్ చేసి.. పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కరోనా బాధితుడు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన విమానంలో.. అతడు కాంటాక్ట్ అయిన ప్రయాణికుల్లో కొంత మందిని గుర్తించి వారి నమూనాలు పరీక్షలకు పంపామని సుధాకర్ పేర్కొన్నారు. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులో మరో వ్యక్తితో కలిసి నివాసం ఉంటున్నాడని.. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా బాధితుడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వారందరినీ స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు.

మరోవైపు ఇంజినీర్ హైదరాబాద్‌లో మహింద్రాహిల్స్‌లో నివాసం ఉండగా.. అతడు కాంటాక్ట్ అయినట్లు భావిస్తున్న మొత్తం 80 మంది వివరాలను ట్రాక్ చేస్తున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బాధితుడిది ఉమ్మడి కుంటుంబమని.. వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించామని ఆయన అన్నారు. అలాగే మహింద్రాహిల్స్‌లో ఉన్న స్థానికులను అప్రమత్తం చేశామని.. అక్కడి పరిసరాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వైరస్ నివారణ రసాయనాలు చల్లారని ఈటెల పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి సూచించారు. Read This Story Also: కరోనా వైరస్‌ గురించి భయం అనవసరం: ఈటల రాజేందర్