Heavy Rain Alert: బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో దంచికొట్టనున్న వాన.. హైదరాబాద్ వాసులూ జర భద్రం..
హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు..

హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు.. నగర వాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాగల 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో 25మీమీ నుంచి 55 మీమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.. రాత్రి 11గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వాహన దారులు ప్రణాళికలను రూపొందించుకుని.. ప్రయాణించాలని.. అప్రమత్తంగా ఉండాలని.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 11, 2025
చెట్ల కింద నిలబడొద్దు..
కాగా.. మధ్యాహ్నం వరకు వాతావరణం కాస్త పొడిగా ఉన్నా రాత్రి వరకు వాన దంచికొడుతుందని అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వర్షం కురిసే సమయంలో భారీ హోర్డింగ్‌లు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు అలెర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే తప్పించుకోవాలని, వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలని జాగ్రత్తలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
