కవితకు శుభాకాంక్షల వెల్లువ

పదునైన పార్టీ వ్యూహరచన.. ఆపై అమితమైన కవిత ఆప్యాయత.. ఈ రెండూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వన్ సైడ్ చేశాయి. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఎన్నికల్లో ఘనవిజయంపై కవితకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాలకు చెందిన నేతలు, బంధుమిత్రులు వివిధ మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉజ్వల భవిష్యత్ ఉండాలని, […]

  • Venkata Narayana
  • Publish Date - 11:26 am, Mon, 12 October 20
కవితకు శుభాకాంక్షల వెల్లువ

పదునైన పార్టీ వ్యూహరచన.. ఆపై అమితమైన కవిత ఆప్యాయత.. ఈ రెండూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వన్ సైడ్ చేశాయి. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఎన్నికల్లో ఘనవిజయంపై కవితకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాలకు చెందిన నేతలు, బంధుమిత్రులు వివిధ మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉజ్వల భవిష్యత్ ఉండాలని, ప్రజలకు మరింత సేవచేయాలని కవితమ్మను ఆశీర్వదిస్తున్నారు. ఇక తెలంగాణలోని అన్ని పార్టీ ఆఫీసులలోనూ కవిత విజయాన్ని కార్యకర్తలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.