సామాన్యుడికి మరో షాక్.. కొండెక్కిన చికెన్ ధర..!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరోసారిగా పెరిగాయి. రెండు నెలల గ్యాప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్ తోపాటూ మరికొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం కొండెక్కాయి.

సామాన్యుడికి మరో షాక్.. కొండెక్కిన చికెన్ ధర..!
Follow us

|

Updated on: Oct 12, 2020 | 2:12 PM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరోసారిగా పెరిగాయి. రెండు నెలల గ్యాప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్ తోపాటూ మరికొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం కొండెక్కగా.. రెండు వారాలుగా కిలో రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 260 దాటింది.ఇటు కోడి గుడ్డు ధరలు కూడా పెరిగాయి.. కరోనా కారణంగా గతంలో గుడ్డు ధర రూ.2 ఉండగా.. అది రూ.4కి చేరింది.

గత నెలరోజుల్లోనే కిలోకు అదనంగా రూ.50 వంతున పెరిగింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధకశక్తి పెంచుకునే క్రమంలో చికెన్‌, కోడిగుడ్ల వినియోగం దేశవ్యాప్తంగా బాగా పెరిగింది. వైద్యులు కూడా కోడిగుడ్లను తినాలని సూచించడంతో మరింత డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు వారానికోమారు చికెన్‌ తిన్న కుటుంబాలు ఇప్పుడు 2, 3 సార్లు కొనుగోలు చేస్తున్నారని చికెన్ షాపు యాజమానులు చెబుతున్నారు. చికెన్‌, గుడ్లతో పాటు చేపలు, మాంసం వినియోగం బాగా పెరిగి, అమ్మకాలు ఇప్పుడు గరిష్ఠస్థాయికి చేరాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 1.80 కోట్ల గుడ్ల అమ్మకాలుండేవి. ఇప్పుడు రోజుకు 2 కోట్ల గుడ్లు అమ్ముడు పోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయినా, గుడ్డు ధర చిల్లర మార్కెట్‌లో రూ.5 నుంచి 6కి చేరింది.

కొవిడ్ ప్రారంభంలో ఫౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకు చికెన్ పేరు చెబితేనే జనాలు వణికిపోయారు.. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫౌల్ట్రీ యజమానులు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు.. చికెన్ షాపుల్లో ఆఫర్లు పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. కానీ రెండు, మూడు వారాలుగా పరిస్థితి మారిపోయింది.. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముందు రూ.100కు చేరిన ధర.. తర్వాత రూ.200.. తాజాగా దాదాపు రూ.300కు దగ్గరకు చేరుకుంటుంది.

అయినప్పటికీ చికెన్ పట్ల జనంలో క్రేజీ తగ్గడంలేదు. రేటు పెరిగిన కొనేందుకే ఇష్టపడుతున్నారు. ఇక వీకెండ్‌లో జనాలు చికెన్ షాపులకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల కిలో మీటర్ల పొడవున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.. చికెన్‌తో పాటూ మటన్‌కు కూడా డిమాండ్ పెరిగింది. కోళ్లకు డిమాండ్ పెరగడంతో ఫౌల్ట్రీ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం.. మార్కెట్‌ కొరతను గుర్తించి ధరలు పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఫౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకాలను తగ్గించడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇక, గుడ్లు, చికెన్‌ వినియోగం పెరిగినందున ధరలూ పెరుగుతున్నాయని అది స్వల్పకాలమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కోళ్ల పరిశ్రమల సమాఖ్య.

Latest Articles
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య..వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య..వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి