Hyderabad: హైదరాబాదీలను హడలెత్తిస్తోన్న వరుస అగ్ని ప్రమాదాలు.. పలు ఆస్పత్రులు, మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలో అగ్నిమాపక నిబంధనలు పాటించని ఆసుపత్రులు, మాల్స్‌కు నోటీసులిచ్చారు.

Hyderabad: హైదరాబాదీలను హడలెత్తిస్తోన్న వరుస అగ్ని ప్రమాదాలు.. పలు ఆస్పత్రులు, మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు
Ghmc
Follow us

|

Updated on: Mar 26, 2023 | 7:42 AM

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలో అగ్నిమాపక నిబంధనలు పాటించని ఆసుపత్రులు, మాల్స్‌కు నోటీసులిచ్చారు. ఆసుపత్రులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, గోదాములు, సిలిండర్ స్టోర్స్, ఫార్మా, ప్లాస్టిక్, రబ్బర్ దుకాణాలు.. ఇలా నగరంలో మొత్తం 23 దుకాణాలు, మాల్స్‌కు నోటీసులు జారీ చేశారు. అమీర్ పేట్, సికింద్రాబాద్, చంద్రాయణగుట్ట, ఈసీఐఎల్‌లో యజమానులకు నోటీసులిచ్చారు. సెల్లార్‌లో ఎమర్జెన్సీ దారి తెరిచి ఉంచాలంటూ అప్రమత్తం చేశారు. మూడు రోజుల్లో సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్  నగరంలో వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో యజమానులు, కార్మికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో మరి మరి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. నిన్న తెల్లవారుజామున అబిడ్స్ కారు గ్యారేజ్‌లో జరిగిన అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.

కాగా గతంలో అగ్నిప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం జరిగేది కాదు. కాని తాజా ఘటనలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ ఆసుపత్రులు, స్కూల్స్, ఫంక్షన్ హాల్స్‌, బహుళ అంతస్థుల భవనాల వారికి ఫైర్‌ సేఫ్టీ అధికారులు అవగాహన కల్గిస్తున్నారు. అబిడ్స్ ప్రమాదం జరిగిన పక్కనే రెండు ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్‌లు, కార్ గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. వాటికి వ్యాపించకుండా సకాలంలో మంటలు అదుపులోకి తీసుకవచ్చామన్నారు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!