Kishan Reddy: సాయుధ బలగాల సంక్షేమమే మోడీ ప్రభుత్వ ధ్యేయం.. 28న హాకీంపేట్‌లో జాబ్‌ ఫెయిర్‌..

సాయుధ బలగాల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: సాయుధ బలగాల సంక్షేమమే మోడీ ప్రభుత్వ ధ్యేయం.. 28న హాకీంపేట్‌లో జాబ్‌ ఫెయిర్‌..
Kishan Reddy
Follow us

|

Updated on: Mar 26, 2023 | 1:56 PM

సాయుధ బలగాల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘అందరికీ ఉపాధి’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎక్స్ సర్వీస్‌మెన్ (మాజీ సైనికుల కోసం – ESM) ఉపాధి సెమినార్‌లు, ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా మార్చి 28న హైదరాబాద్ హకీంపేటలో జాబ్ ఫెయిర్‌ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో ఉత్సాహంగా పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటన విడుదల చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ హకీంపేటలో నిర్వహించే ఈ మేళాలో దాదాపు 2,000 ESM, దాదాపు 50 కార్పోరేట్‌ కంపెనీలో రావచ్చని అంచనా వేస్తున్నట్లు జి కిషన్ రెడ్డి తెలిపారు.

“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ సాయుధ దళాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి ‘అందరికీ ఉపాధి’.. అన్న నినాదంతో రక్షణ మంత్రిత్వ శాఖ విజన్ డాక్యుమెంట్, డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ అనుబంధ కార్యాలయం ఎక్స్ సర్వీస్‌మెన్ (ESM) ఉపాధి సెమినార్‌లను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా జాబ్ మేళాలు.. ఉపాధి సెమినార్‌లు బాగా శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులు (ESM), కార్పొరేట్లు/PSUల మధ్య వారధిగా పనిచేస్తాయి. ఇది ఇద్దరికీ పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని కలిగిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఇండస్ట్రీ, కార్పొరేట్‌ల సహకారంతో డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ కేంద్రం చొరవ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ ప్రోత్సాహంతో దేశానికి సేవలో తమ జీవితకాలంలో ప్రధానమైన సేవను అందించిన మాజీ సైనికులకు ఉపాధిని కల్పించడానికి అనుగుణంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

హకీంపేటలో జరిగేటటువంటి జాబ్ మేళాలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి, రాబోయే కంపెనీలు, మాజీ సైనికులను ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి, అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులు, ఆసక్తిగల మాజీ సైనికులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. “సాయుధ దళాలు దేశంలో అత్యంత గౌరవనీయమైన సంస్థ, మనందరికీ జాతీయ గర్వకారణం. సాయుధ దళాలకు చెందిన పురుషులు, మహిళలు దేశాన్ని కాపాడటంలో, అంతర్గత కలహాలను నిర్వహించడంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమవంతు సహాయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయినప్పటికీ, మన సాయుధ దళాల యువశక్తిని కొనసాగించడానికి, చాలా మంది సైనికులు చిన్న వయస్సులోనే పదవీ విరమణ చేస్తారు. అనంతరం వారు తమ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ కూడా.. ఉపాధి చూసుకుంటారు. ఇటువంటి జాబ్ మేళాల ద్వారా ప్రభుత్వం మాజీ సైనికులకు శిక్షణ, సంసిద్ధత, వారు ఎంచుకున్న రెండవ కెరీర్‌లో ప్రభావవంతంగా పునరావాసం కల్పించేలా చూస్తోంది” అని కిషన్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి

భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ ఆకాంక్షకు అనుగుణంగా రక్షణ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తాయని తెలిపారు. తెలంగాణలోని కంపెనీలు, స్టార్టప్‌లు, యువత దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. “రక్షణ పరికరాల ఎగుమతిని పెంచే ఉద్దేశంతో కొత్త రక్షణ ప్రాజెక్టులు రూపొందించారు.. మూడు సేవలకు చెందిన సాంకేతిక నిపుణులు నేడు కొత్త తరం క్షిపణులు, ట్యాంకులు, ఆయుధాల వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విమానాలు, విమాన వాహక నౌకలు, ఫ్రిగేట్లు, సిమ్యులేటర్లు, రాడార్లు వంటి అత్యాధునిక పరికరాలను నిర్వహిస్తున్నారు.’’

ఉద్యోగ మేళాలో మాజీ సర్వీస్ మెన్ నుంచి ఉత్సాహభరితమైన స్పందన కోసం తాను ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. సాధారణ నిర్వహణ, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, పరికరాల సాంకేతిక నిర్వహణ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటాలో వివిధ నైపుణ్యాలు, పరిపాలనా నైపుణ్యాలలో ఉపాధి పొందవచ్చని మంత్రి చెప్పారు. “ఈ జాబ్ మేళాల ద్వారా దేశ అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మాజీ సైనికోద్యోగులను పరిశ్రమతో అనుసంధానించాలని మేము ఆశిస్తున్నాము” అని కిషన్ రెడ్డి తెలిపారు.

వెబ్ సైట్ ను సందర్శించండి..

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (DGR).. ప్రత్యేక ప్రకటనలో మాజీ సైనికుల సంక్షేమ శాఖ, కాన్ఫెడరేషన్ హెచ్‌క్యూ ట్రైనింగ్ కమాండ్, IAF ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి సెమినార్/జాబ్ ఫెయిర్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. 2023 మార్చి 28న హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ హకీంపేట్‌లో ఇండియన్ ఇండస్ట్రీస్ లో మాజీ సైనికులు, యజమానులు/ఉద్యోగ ప్రదాతలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా పదవీ విరమణ చేసిన, పదవీ విరమణ పొందిన సాయుధ దళ సిబ్బందికి తగిన ప్లేస్‌మెంట్ అవకాశాలను అందించడం ఈ సెమినార్ లక్ష్యమని తెలిపింది. 37 నుంచి 57 సంవత్సరాల మధ్య వయస్సు గల ట్రై-సర్వీస్‌ల అనుభవజ్ఞులు పాల్గొనడానికి దీనిలో అర్హులు. పాల్గొనేవారి కోసం అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. దరఖాస్తుదారులు DGR వెబ్‌సైట్: https://dgrindia.gov.in నుంచి దరఖాస్తు ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..