Hyderabad: సైక్లింగ్‌ లవర్స్‌ కోసం జీహెచ్‌ఎమ్‌సీ కీలక నిర్ణయం.. నగరంలో 90 కీలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్‌..

భవిష్యత్తులో హైదరాబాద్‌ విశ్వానగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సిన అవసరంతో పాటు, వారి శారీరిక, మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్‌ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు...

Hyderabad: సైక్లింగ్‌ లవర్స్‌ కోసం జీహెచ్‌ఎమ్‌సీ కీలక నిర్ణయం.. నగరంలో 90 కీలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్‌..
Cycling Track In Hyderabad
Follow us

|

Updated on: Oct 07, 2022 | 4:14 PM

హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మరో కీలక అడుగు పడింది. ఫ్లై ఓవర్‌లు, సబ్‌వేలు, స్కైవేలతో విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గింపు, శారీరక దృఢత్వం పెరిగే విధంగా నగర ప్రజలకు మెరుగైన సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సైక్లింగ్‌ ట్రాక్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ట్రాక్‌లను కొన్ని చోట్ల తాత్కాలికంగా, మరికొన్ని చోట్ల శాశ్వతంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగర వ్యాప్తంగా ఎంపిక చేసిన జోన్లలో సుమారు 90 కిలోమీటర్లు పొడవులో సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ ట్రాక్‌లు అందుబాటులోకి కూడా వచ్చేశాయ్‌.

ఇందులో భాగంగానే ఎల్బీ నగర్‌లో హబ్సిగుడా క్రాస్ రోడ్డు నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు 3 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్‌ను శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు. బైరమల్ గూడ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల శాత్వతంగా, చార్మినార్ జోన్‌లో ఓవైసీ జంక్షన్ నుంచి అరంఘార్ వరకు శాశ్వతంగా( మోడల్ రోడ్ కారిడార్), అరమ్‌ఘర నుంచి పీడీపీ జంక్షన్ వరకు 4 కిలో మీటర్లు శాశ్వత ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఖైరతాబాద్‌ జోన్‌లో కేబీఆర్‌ అరౌండ్‌ పార్క్‌ 6 కిలోమీటర్ల తాత్కాలిక ట్రాక్‌, ఓయూ కాలనీ నుంచి సెనార్‌ వ్యాలీ రోడ్డు నెంబర్‌ 82 జూబ్లీ హిల్స్‌ రోడ్ నెంబర్‌ 45 జూబ్లీహిల్స్‌ రోడ్‌ లిమిట్ వరకు 6 కి.మీల ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు.

శేరిలింగంపల్లి జోన్ విషయానికొస్తే.. దుర్గం చెఱువు కేబుల్ బ్రిడ్జ్‌, ఐకియా నుంచి బయోవర్సిటీ రాయదుర్గం వరకు 6 కిలో మీటర్లలో కొంత మేర శాత్వతంగా, కొంత తాత్కాలికంగా ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఖాజా దుర్గ జంక్షన్ నుంచి కేర్ హాస్పిటల్ వరకు , లింక్ రోడ్డు నుంచి ఖాజా గూడ రోడ్డు 6 కిలో మీటర్లు రోడ్డు, కూకట్‌పపల్లి ఐడిఎల్ చెరువు (NH 65) నుంచి జీఎన్‌టీయూ రెయిన్ బో విస్ట నుంచి ఐడిఎల్ చెరువు వరకు 10 కిలో మీటర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి బాలా నగర్ వరకు 25 కిలో మీటర్లు తాత్కాలికంగా, సికింద్రాబాద్ జోన్‌లో మెట్టు గూడ X రోడ్డు నుంచి హబ్సిగూడ X రోడ్డు వరకు 4 కిలోమీటర్లు, బుద్ధ భవన్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వయా నెక్లెస్ రోడ్డు 6 కిలోమీటర్లు వరకు కొంత మేర పర్మనెంట్, మరికొంత మేర సైక్లింగ్ ట్రాక్ రోడ్డు చేయనున్నారు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో హైదరాబాద్‌ విశ్వానగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సిన అవసరంతో పాటు, వారి శారీరిక, మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్‌ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు. అంతకు ముందు ప్రయోగాత్మకంగా ఆయా జోన్ పరిధిలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నగరవ్యాప్తంగా 90 కిలోమీటర్లమేర శాశ్వతంగా, తాత్కాలిక ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..