AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: ‘మై హోమ్’కు వరించిన క్వాలిటీ అవార్డు.. నాణ్యతతో ఖర్చులు ఆదా అంటున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్..

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రి కాకముందు నుంచే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సత్సంభాంధాలు ఉన్నట్లు తెలిపారు.

Piyush Goyal: ‘మై హోమ్’కు వరించిన క్వాలిటీ అవార్డు.. నాణ్యతతో ఖర్చులు ఆదా అంటున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
Central Minister Piyush Goyal
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2022 | 6:54 PM

Share

రియల్ ఎస్టెట్ దిగ్గజం మైహోమ్ గ్రూప్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ‘మైహోమ్ తర‌క్ష్య ప్రాజెక్ట్‌కి’ బెస్ట్‌ క్వాలిటీ అవార్డ్ లభించింది. ఢిల్లీలోని జన్‌పథ్‌లోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నాణ్యతా సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు భవన నిర్మాణాల్లో పలు అంశాలను, నాణ్యతను ఆధారంగా తీసుకుని అవార్డులు అందజేస్తుంది. దీనిలో భాగంగా గురువారం జరిగిన 14th QCI-DL షా క్వాలిటీ ప్లాటినం అవార్డ్-సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ సహా పలు సంస్థలకు అవార్డ్స్ ను ప్రదానం చేసింది. ఈ అవార్డును కేంద్రమంత్రి పియూష్ గోయల్ అందజేశారు. మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ తరపున అవార్డును మై హోమ్ కన్‌స్ట్రక్షన్ సీనియర్ ప్రెసిడెంట్ పురుషోత్తం ఎంకే రవి సాయి అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రి కాకముందు నుంచే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు అవకాశం ఇచ్చిన నాటినుంచి తాను.. క్వాలిటీ కౌన్సిల్ పనితీరును పరిశీలిస్తున్నారన్నారు. క్వాలిటీ అనేది అధిక ధరలతో దొరకదని.. సంస్థలు నిర్మాణపరంగా ఆలోచిస్తేనే అందుబాటులోకి వస్తుందన్నారు. అధిక ధరలకు కాకుండా.. నాణ్యతను ఎప్పుడూ అందుబాటు ధరలకు అందేలా తీసుకురావాలన్నారు. దీనిలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పని తీరు మెరుగుపడిందని.. దేశం అభివృద్ది చెందాలా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు.

మైహోమ్‌ అంటే గృహాలనిర్మాణాలే కాదు.. కస్టమర్ల దగ్గర నమ్మకాన్ని కూడా నిర్మించామంది సంస్థ. అందుకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారంను సొంతం చేసుకుంది. మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ మూడు దశాబ్దాలుగా గృహాలను నిర్మిస్తోంది. కస్టమర్ల అంచనాలను అందుకోవడం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటోంది. నాణ్యత, విశ్వసనీయత, సమగ్రత అనే సూత్రాలతో మై హోమ్ కన్‌స్ట్రక్షన్ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి.. కస్టమర్ల మన్ననలు పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..