కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతోంది.. అందుకే బీజేపీలో చేరాః కూన శ్రీశైలం
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తానికి హ్యాండిచ్చి కమలం పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.
Kuna Srisailam Goud Joined in BJP వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనన్న ధీమాలో ఉన్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెంచింది. ఇప్పటికే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని తేలిపోవడంతో సంస్థాగతంగా బలమైన నాయకుల్ని అక్కన చేర్చుకుంటోంది. చతికిలాపడ్డా హస్తం పార్టీ నేతలను మెల్లిగా కషాయం కండువా కప్పేస్తున్నారు. ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తానికి హ్యాండిచ్చి కమలం పార్టీలో చేరిపోయారు.
తెలంగాణలో బలపడుతున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేస్తోంది. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆయన గత కొంతం కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించి.. అలా బీజేపీలో చేరారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.
2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అశించిన కూన శ్రీశైలానికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీ పట్ల కొంత అసంతృప్తితోనే ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అయితే, గత ఆరున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతోందని కూన ఆరోపించారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి బీజేపీనే సరైందనే భావనతో పార్టీ మారినట్టు శ్రీశైలం చెప్పారు.
ఆపరేషన్ హైదరాబాద్ చేపట్టిన బీజేపీ.. ఆ టాస్క్‌లో సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా సత్తాచాటిన కమలం.. ఇప్పుడు పక్క పార్టీల నేతలను ఎట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఉన్న పార్టీలో సరైన గుర్తింపు రాక, అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు గాలం వేస్తూ కాషాయం కండువా కిందికి ఆహ్వానిస్తోంది.
Read Also… సర్కారుకు తలనొప్పిగా మారిన పోడు.. గిరిజన భూములపై నాయకుల మాటల తూటాలు..