BJP Vijaya Sankalpa Sabha: ఆయన మాటల్లో ఫిలాసఫీ.. ప్రధాని మోదీ ప్రసంగంపై గద్దర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Gaddar on PM Modi Speech: బహిరంగ సభ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఎవరిపైన పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేవలం ప్రధాని ప్రసంగం విందమనే వచ్చాను..

BJP Vijaya Sankalpa Sabha: ఆయన మాటల్లో ఫిలాసఫీ.. ప్రధాని మోదీ ప్రసంగంపై గద్దర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Gaddar On Pm Modi Speech
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 03, 2022 | 9:32 PM

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం మొత్తం పరిశీలనగా విన్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఎవరిపైన పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేవలం ప్రధాని ప్రసంగం వినేందుకే వచ్చాను.. ప్రధాన మంత్రి చాలా కాలం తర్వాత కేవలం ఫిలాసఫీ మీద మాట్లాడరు. ఒక తత్త్వవేత్త.. బీజేపీ భావవాదం నుంచి వేరుగా.. డెమొక్రటిక్‌గా మాట్లాడుతున్నారా లేదా అని ప్రధాని మోదీ ప్రసంగం వినడం జరిగిందన్నారు.

ఇదిలావుంటే.. బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణానికి గద్దర్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గద్దర్ పెరేడ్ గ్రౌండ్ కు రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరుచగా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల సభకు హాజరైన గద్దర్ ఇవాళ మోడీ సభకు హాజరుకావడం గమనార్హం.

తెలంగాణ వార్తల కోసం