Uppal Child Murder Case: ఉప్పల్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై ఆత్యాచారం.. ఆపై హత్య!
ఉప్పల్ రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మనోజ్ పాండే(5) అనే ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమర్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది. బాలుడు మనోజ్ పాండే (5) ఈనెల 12న కనబడకుండా పోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది..

హైదరాబాద్, ఆగస్ట్ 16: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మనోజ్ పాండే(5) అనే ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమర్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది. బాలుడు మనోజ్ పాండే (5) ఈనెల 12న కనబడకుండా పోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే కనబడకుండా పోయిన బాలుడు అనూహ్యంగా మృతి చెందికనిపించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడిస్తూ..
ఛత్తీస్‌గడ్ కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడ పిల్లలు పూనం(10), గడియ(8) ఒక బాలుడు మనోజ్ పాండే(5) ఉన్నారు. కుటుంబ సమేతంగా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో ఉంటున్నారు. అక్కడే టింబర్ డిపోలో ఈశ్వర్ పాండే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే టింబర్ డిపోలో బీహార్ కు చెందిన కమర్ అనే మరో వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్ట్ 12న బాలుడు మనోజ్ పాండే కిడ్నాప్ అయ్యాడు. బాలుడిని కమర్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బిహార్‌కు చెందిన కమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.
సమీపంలోని ముళ్ల పొదల్లో బాలుడు మనోజ్ పాండే ను కమర్ అత్యాచారం చేసి గొంతు నుమిలి హత్య చేసినట్లు తెలిపాడు. పోలీసులు హంతకుడు కమర్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




