GHMC: జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఫైల్స్..
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జోనల్ మున్సిపల్ కార్యాలయంలోని మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో మంటలు చెలరేగడంతో..
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జోనల్ మున్సిపల్ కార్యాలయంలోని మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన స్థలానికి అగ్ని మాపక , డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు మూడు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆఫీసులో పని చేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.
పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. GHMC కార్యలయంలో ని మూడో అంతస్థులో అగ్ని ప్రమాదం లో లిఫ్ట్ లో ఇరుక్కున్న ఇద్దరిని సురక్షితం గా బయటకి తీసిన అధికారులు. ఐదో అంతస్తులో పలువురు చిక్కుకున్నారు. వారంతా భయంతో కార్యాలయం టెర్రస్ పైకి పరుగులు తీశారు. మంటలు అదుపులోకి రావడంతో క్రేన్ సహాయంతో కిందికి దిగారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియలేదు.
ఇవి కూడా చదవండి: Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..
Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..