Telangana: సంక్రాంతి తరువాత అక్కడికి వెళతాం.. వనామా వ్యవహారంలో వీహెచ్ కీలక వ్యాఖ్యలు..
Telangana: వనామా రాఘవ(Vanama Raghava) వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు(VH) తీవ్రంగా స్పందించారు.
Telangana: వనామా రాఘవ(Vanama Raghava) వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు(VH) తీవ్రంగా స్పందించారు. కొత్తగూడెంలో(Kottagudem) జరిగిన ఘటన నిర్భయ కేసు కన్నా ఎక్కువగా ఉందని అన్నారు. రాఘవేంద్ర అసైన్డ్, ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేశాడని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. వనామా వ్యవహారంలో ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ‘‘కేసీఆర్ మీ చుట్టాలల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. రాష్ట్రంలో ఎంతోమంది రైతులు చనిపోతున్నారు. పాల్వంచకైనా పోవాలి.’’ అని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్కరు కూడా ఈ వ్యవహారంపై ఇంత వరకు మాట్లాడలేదని విమర్శించారు. అసలు దీనిపై పోలీసులు కేసు పెట్టలేదని ఆరోపించారు. వనమా వెంకటేశ్వర రావు తో రాజీనామా చేపిస్తే ప్రజలు హర్షిస్తారని వీహెచ్ పేర్కొ్న్నారు.
తెలంగాణ గుండాల రాజ్యంగా మారుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీహెచ్. ఇంత చేసిన వనామాకు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి తరువాత వనామా కబ్జా చేసిన భూముల వద్దకు వెళతామన్నారు. వనామా ఆక్రమించిన భూములను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు వి. హనుమంతరావు. నయీమ్‌ను మించిన వ్యక్తి వనామా రాఘవ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also read:
Uttar Pradesh Elections: అత్యాచార బాధితులే అక్కడ అభ్యర్థులు.. ప్రియాంక కొత్త ఎత్తుగడ..
Viral Video: మొసలితోనే పరాచకాలా… సరదా తీర్చిందిగా.. చావు తప్పి..