Telangana: ఒక్కో సర్టిఫికెట్‌ రూ.50వేలు నుంచి రూ.5లక్షలు.. తెలంగాణలో భారీ స్కామ్.. మీసేవలో అప్లై చేసి..

తెలంగాణలో మరో భారీ స్కామ్ బయటపడింది. రంగారెడ్డిజిల్లా మంచాల ఎమ్మార్వో ఆఫీస్‌లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. విచ్చలవిడిగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు జారీ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అడ్డదారిలో సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. అనుమానం రాకుండా ఎస్డీపీ ఆపరేటర్ -2 పేరుతో లాగిన్ అయి మూడు ఫోన్ నెంబర్లతో భారీ స్కామ్‌కి పాల్పడ్డారు. ఎమ్మార్వో లాగిన్ ఐడీ మొదలు కొని సిగ్నేచర్ వరకూ విచ్చలవిడిగా వాడేశారు.

Telangana: ఒక్కో సర్టిఫికెట్‌ రూ.50వేలు నుంచి రూ.5లక్షలు.. తెలంగాణలో భారీ స్కామ్.. మీసేవలో అప్లై చేసి..
Fruad
Follow us

|

Updated on: Jun 30, 2024 | 7:23 AM

తెలంగాణలో మరో భారీ స్కామ్ బయటపడింది. రంగారెడ్డిజిల్లా మంచాల ఎమ్మార్వో ఆఫీస్‌లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. విచ్చలవిడిగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు జారీ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అడ్డదారిలో సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. అనుమానం రాకుండా ఎస్డీపీ ఆపరేటర్ -2 పేరుతో లాగిన్ అయి మూడు ఫోన్ నెంబర్లతో భారీ స్కామ్‌కి పాల్పడ్డారు. ఎమ్మార్వో లాగిన్ ఐడీ మొదలు కొని సిగ్నేచర్ వరకూ విచ్చలవిడిగా వాడేశారు. 800మంది స్థానికేతరులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఫీజ్‌ రియంబర్స్మెంట్ , స్కాలర్ షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికేట్లు మంజూరు చేశారు.

కొంతమంది నిందితులు గ్యాంగ్‌గా ఏర్పడి హైదరాబాద్ లోని పలు మీ సేవల ద్వారా దరఖాస్తూ చేసి.. ఈ స్కామ్‌కి తెరతీశారు. అర్జీదారులు లేకుండానే సర్టిఫికేట్లు విడుదల వేసి నేరుగా ఇంటికే పంపించింది గ్యాంగ్. ఒక్కో సర్టిఫికెట్‌కి రూ.50వేల నుంచి రూ.5లక్షలు వసూలు చేసింది. వీఆర్‌ఏ, డీటీ, ఆర్‌ఐల రిపోర్ట్‌ ప్రమేయం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించింది. ఈస్కామ్ 2022 ఫిబ్రవరి నుంచి 2024 వరకూ నడిపించినట్లు తెలుస్తోంది. సుమారుగా 800కు పైగా సర్టిఫికేట్లు జారీ చేసి స్కామ్‌కి పాల్పడ్డారు. తహశీల్దార్ డిజిటల్ కీ సంతకంతో గుట్టుచప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి అమ్ముకున్నారు. జోబులు ఫుల్లుగా నింపుకున్నారు.

420, 409 సెక్షన్ల కింద కేసు.. నిందితుల కోసం గాలింపు..

జిల్లా మైనార్టీ ఆఫీసు నుంచి మండల కార్యాలయానికి లేటర్ రావడంతో పరిశీలించిన అధికారులు స్కామ్‌ను గుర్తించారు. దీంతో తీగలాగితే డొంక బయటపడింది. అర్జీదారులను ఎవరనేదానిపై ఎంక్వైరీ చేయగా నాన్ లోకల్ అని తేలడం.. అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా ఉండడంతో అధికారులు కంగుతిన్నారు. స్కామ్‌పై మంచాల పీఎస్‌లో ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. స్కామ్‌లో భాగమైన కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మంచాల ఎమ్మార్మో ఫిర్యాదు మేరకు 420,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం బయటకు పొక్కుండా గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు..

ఇలానే హైదరాబాద్ తోపాటు.. రాష్ట్రంలోని పలు చోట్ల మీసేవల్లో అప్లై చేసి.. స్కామ్ లు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక్క చోటనే ఈ స్కాం బయటపడిందని.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..