Rain Alert: అబ్బ.. చలచల్లని వార్త.. ఇక వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతోపాటు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో నైరుతి దిశగా అనువాద ఆవర్తనం ఉంది.. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert: అబ్బ.. చలచల్లని వార్త.. ఇక వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 07, 2024 | 1:24 PM

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతోపాటు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో నైరుతి దిశగా అనువాద ఆవర్తనం ఉంది.. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు వర్ష సూచన చేసింది.. తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన..

తెలంగాణలో కూడా వాతావరణ శాఖ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. దీంతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనావేసింది..

కూలిన చెట్లు – ట్రాఫిక్ జామ్..

ఖమ్మం జిల్లాలోని వైరా, కొనిజర్ల మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. వైరా మండలం రెబ్బవరం గ్రామం సమీపంలో ఈదురుగాలులకు రోడ్లపై భారీ చెట్లు కూలిపోయాయి. రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. జేసీబీతో చెట్టును తొలిగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..