Durga Temple: ఆ చీరనే.. ఈ చీర.. అమ్మవారి సాక్షిగా ఇంద్రకీలాద్రిపై మోసాల దందా.. మారేదెప్పుడు..?

బెజవాడ దుర్గమ్మ గుడిలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. అమ్మవారికి భక్తులు ప్రేమతో ఇచ్చే చీరలను గోల్‌మాల్‌ చేస్తున్న వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అమ్మవారి చీరల ముసుగులో ఇంద్రకీలాద్రిపై వ్యాపారం నడుస్తోంది. భక్తుల నమ్మకాన్ని అమ్మవారి గుడిని అడ్డం పెట్టుకుని ఏళ్ళ తరపడి దోచేస్తున్నారు.

Durga Temple: ఆ చీరనే.. ఈ చీర.. అమ్మవారి సాక్షిగా ఇంద్రకీలాద్రిపై మోసాల దందా.. మారేదెప్పుడు..?
Vijayawada Durga Temple
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 30, 2024 | 9:01 AM

బెజవాడ దుర్గమ్మ గుడిలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. అమ్మవారికి భక్తులు ప్రేమతో ఇచ్చే చీరలను గోల్‌మాల్‌ చేస్తున్న వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అమ్మవారి చీరల ముసుగులో ఇంద్రకీలాద్రిపై వ్యాపారం నడుస్తోంది. భక్తుల నమ్మకాన్ని అమ్మవారి గుడిని అడ్డం పెట్టుకుని ఏళ్ళ తరపడి దోచేస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు మారిన ఇక్కడి మోసాల తీరు మాత్రం మారటం లేదు. ఆలయంలో.. సిబ్బంది చేతివాటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

బెజవాడలో కొలువైన దుర్గమ్మకు తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశం నలుమూలల దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తుంటారు. దుర్గమ్మ.. భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. అమ్మవారికి చీర సమర్పిస్తే తాము అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మకు చీరలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. అమ్మవారికి చీర సమర్పించిన తర్వాత ఆ చీరను మళ్ళీ ఆలయం లోనే భక్తులకు అమ్ముతారు. ఇక ఈ అమ్మే క్రమంలోనే అసలు దందా షురూ అవుతుంది.

భక్తులు సమర్పించిన చీరలను వారు కోరిన రోజు అమ్మవారికి అలంకరిస్తారు అర్చకులు. తర్వాత శారీ కౌంటర్‌కి పంపుతారు. లేదంటే సమర్పించిన భక్తులకే తిరిగి ఇస్తారు. కొందరు భక్తులు అమ్మవారికి పట్టుచీరను అలంకరించిన తర్వాత షాప్‌లో కొనుగోలు చేసిన ధర టెంపుల్‌కు చెల్లించి తీసుకెళ్తుంటారు. కొన్ని చీరలకు దేవస్థానమే రేటు నిర్ణయించి ఇంద్రకీలాద్రిపై వస్త్ర ప్రసాదం కౌంటర్‌లో అందుబాటులో ఉంచుతుంది. అందులో తాము కోరుకున్న చీరను కొందరు భక్తులు నిర్దేశిత రుసుము చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. ఇది ఎప్పుడూ రొటీన్‌గా జరిగే పద్ధతి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇంద్రకీలాద్రిపై చీరలు అమ్మటమే కాకుండా, అమ్మవారి ముసుగులో ఏకంగా ఓ పెద్ద వ్యాపారమే నడుస్తున్నారు.

అమ్మవారికి చీరలు వచ్చాయంటూ భక్తులకే టోకరా పెట్టేస్తున్నారు ఆలయ సిబ్బంది. బయట మార్కెట్ నుంచి తెచ్చిన చీరలను గుట్టల కింద పోసి దుర్గగుడి పైన అమ్మవారి చీరలు అంటూ కౌంటర్‌లో అమ్మేస్తున్నారు. ఇలా వచ్చిన ప్రతి కాంట్రాక్టర్ భక్తులను నిలువు దోపిడి చేస్తూనే ఉన్నారు. ఇలా కొండపైన ఒక కౌంటర్ కొండ కింద మరో కౌంటర్ పెట్టి మరి అమ్మవారి చీరల ముసుగులో వ్యాపారాన్ని దర్జాగా నడిపిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదులు అందాయి. ఆలయానికి భారీగా కోట్లలో నష్టం వచ్చిందని ఫిర్యాదు చేయడంతో ఆడిట్ చేసిన అధికారులు నిజాలు తేల్చి రిపోర్టు ఇచ్చారు. కానీ ఇంత వరకు చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపై జరుగుతున్న అవినీతిలో మాత్రం మార్పు రావటం లేదు. కనీసం ఇప్పటికైనా అవినీతికి అడ్డుకట్ట వేయాలంటున్నారు భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అట్లీ పాన్ ఇండియా సినిమా..
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అట్లీ పాన్ ఇండియా సినిమా..
అడవులను, పంటలను కాపాడే దేవత పంజుర్లి.. ఎవరి అవతారం అంటే
అడవులను, పంటలను కాపాడే దేవత పంజుర్లి.. ఎవరి అవతారం అంటే
బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. జైషా కీలక నిర్ణయం..
బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. జైషా కీలక నిర్ణయం..
మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై సమీక్ష..
మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై సమీక్ష..
ఈ చెట్టు కాండంలో ఊరిన నీళ్ళు కిడ్నిస్టోన్‌కు సంజీవిని..
ఈ చెట్టు కాండంలో ఊరిన నీళ్ళు కిడ్నిస్టోన్‌కు సంజీవిని..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే