AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber crime: తెలియని మహిళ నుంచి వీడియో కాల్‌.. అంతలోనే నగ్నంగా మారి

ప్రస్తుతం నేరాలు మారిపోతున్నాయి. మనిషి అత్యాశను, బలహీనతను పెట్టుబడిగా మార్చుకొని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో జరిగిది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్‌ కాల్‌తో చిక్కుల్లో పడ్డాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి..

Cyber crime: తెలియని మహిళ నుంచి వీడియో కాల్‌.. అంతలోనే నగ్నంగా మారి
Whatsapp Video Call
Narender Vaitla
|

Updated on: Nov 23, 2024 | 7:51 AM

Share

నేరాల శైలి రోజురోజుకీ మారిపోతోంది. ఒకప్పుడు దొంగలు ఇళ్లలోకి దూరి దోపిడి చేసేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ మారింది. మారిన టెక్నాలజీతో పాటు నేరాల శైలి కూడా మారింది. ఎక్కడో కూర్చొని మన ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు. అయితే మనకు తెలియకుండా మన ఖాతాను ఖాళీ చేసే వారు కొందరైతే.. బెదిరించి డబ్బులు వసూలు చేసే వారు మరి కొందరు ఉన్నారు.

ఇటీవల ఇలాంటి నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాల బారిన చదువుకున్న వారు కూడా పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇంజీనిరింగ్ చదువుతున్న ఓ విద్యార్థికి కిలాడీ లేడీ వీడియో కాల్‌ చేసి డబ్బులు కాజేసి డబ్బులు కాజేసింది. మొదట్లో కొన్ని డబ్బులు పంపించినా వేధింపులు ఆగకపోవడంతో కుర్రాడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్లే ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న 22 ఏళ్ల కుర్రాడు.. చౌదరిగూడ మల్లమ్మకాలనీలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇదే సమయంలో గురువారం రాత్రి అతని వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్‌ అనే పేరుతో ఓ వీడియో కాల్‌ వచ్చింది. ఎవరో తెలియని వ్యక్తి కాల్‌ చేశారాన్న భావనతో ఆ కుర్రాడు కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. మొదట్లో బాగున్నావా.? ఎలా చదువుకుంటున్నావు.? అని యోగక్షేమాలు అడుగుతున్నట్లు నటించిన సదరు మహిళా ఒక్కసారిగా నగ్నంగా మారింది.

అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కుర్రాడు కాసేపటికే కాల్‌ కట్ చేశాడు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలో నగ్నంగా మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్‌ రికార్డును చేసిన వీడియోను విద్యార్థికి పంపించి డబ్బులు డిమాండ్‌ చేయడం ప్రారంభించింది. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు వీడియోను పంపిస్తానని బెదిరించింది. దీంతో చేసేది ఏం లే మూడు విడతల్లో మొత్తం రూ. 20 వేలు పంపించాడు. అంతకు ఆగని ఆ మహిళ మరింత మొత్తంలో డిమాండ్‌ చేసింది దీంతో ఏదో జరుగుతోందని భయపడ్డ విద్యార్థి పోచారంఐటీకారిడార్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వీడియో కాల్స్‌ వచ్చినప్పుడు లిఫ్ట్‌ చేయకుండా ఉండడమే ఉత్తమనని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరని తెలుసుకోవాలనిపిస్తే.. ఫ్రంట్‌ కెమెరాకు వేలు అడ్డు పెట్టి లిఫ్ట్‌ చేయాలని చెబుతున్నారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను సేవ్‌ చేసుకోకూడదు. అలాగే ఆన్‌నోన్‌ నెంబర్స్‌ యాడ్‌ చేసే వాట్సాప్‌ గ్రూప్‌లలో చేరకూడదు. ఇందుకోసం ప్రైవసీలో ఉండే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..