AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్.. ఓ వైపు ప్రచార హోరు.. మరోవైపు ఐటీ, ఈడీ దాడులు..

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడింది.. పోలింగ్ డేట్ దగ్గరపడటంతో పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.. ఈ తరుణంలో నేతల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపాయి. పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఇంట్లో 20లక్షలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అటు..హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులపై ఐటీ దాడులు జరిగాయి.

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్.. ఓ వైపు ప్రచార హోరు.. మరోవైపు ఐటీ, ఈడీ దాడులు..
It Ed Raids
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 26, 2023 | 9:36 AM

Share

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడింది.. పోలింగ్ డేట్ దగ్గరపడటంతో పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.. ఈ తరుణంలో నేతల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపాయి. పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఇంట్లో 20లక్షలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అటు..హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులపై ఐటీ దాడులు జరిగాయి. పాతబస్తీలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలోనూ ఐటీ దాడులు కొనసాగాయి. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజిద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు కొనసాగాయి. కోహినూర్ కింగ్స్ గ్రూప్ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లపై సోదాలు జరిగాయి. రాజభవన్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అంతేకాకుండా ఐఏఎస్ మాజీ అధికారి ఏకే గోయల్ ఇంట్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన నివాసంలో భారీగా డబ్బులు దాచారనే సమాచారం రావడంతో.. గోయల్ నివాసంలో సోదాలు చేశారు.

ఐటీ ఎలక్షన్‌ స్క్వాడ్‌ సోదాల విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు అక్కడకు భారీఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఖైరతాబాద్‌ అభ్యర్థి విజయారెడ్డి సైతం నిరసన తెలిపారు. ఇది BRS‌ అధికార దుర్వినియోగమే అని విమర్శించారు. మొన్న.. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మిర్యాలగూడలో వైదేహీనగర్‌లోని ఎమ్మెల్యే బంధువు.. కాంట్రాక్టర్, స్థిరాస్తి వ్యాపారి ఇంజం శ్రీధర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు బంధువులు, అనుచరుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అలానే.. హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో.. ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగపేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహ్మారెడ్డి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కయంటూ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై కావాలనే ఐటీ, ఈడీ సంస్థలతో దాడులు చేయిస్తున్నాయని ఆ లేఖలో రేవంత్‌ ఆరోపించారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారంటూ ఆ లేఖలో టీపీసీసీ చీఫ్‌ ఆరోపించారు.

మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలకు వెళుతున్న రాజకీయ నేతల వాహనాలను కూడా వదలకుండా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఈడీ, ఐటీ రైడ్స్‌.. పొలిటికల్‌ ఫైట్‌కు తెరలేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్