Daaji: కమలేశ్ దాజీకి గ్లోబల్ అంబాసిడర్ అవార్డు.. ఉపరాష్ట్రపతి ధన్కర్ సమక్షంలో అందజేత..

ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్‌ గ్లోబల్ మహోత్సవ్‌ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో జరుగుతోన్న గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో దేశవిదేశాలకు చెందిన 300 మందికి పైగా ఆధ్యాత్మిక గురువులు, లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు.

Daaji: కమలేశ్ దాజీకి గ్లోబల్ అంబాసిడర్ అవార్డు.. ఉపరాష్ట్రపతి ధన్కర్ సమక్షంలో అందజేత..
Kamlesh D. Patel
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 17, 2024 | 1:23 PM

ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్‌ గ్లోబల్ మహోత్సవ్‌ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో జరుగుతోన్న గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో దేశవిదేశాలకు చెందిన 300 మందికి పైగా ఆధ్యాత్మిక గురువులు, లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. శనివారం జరిగిన మూడో రోజు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు కమలేష్ డి పటేల్ (దాజీ) ఆధ్వర్యంలో గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ కొనసాగుతోంది.

ఆధ్యాత్మిక గురువు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత దాజీ కమలేష్ పటేల్‌ అందించిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం లభించింది. సెక్రటరీ జనరల్ కామన్వెల్త్ ద్వారా దాజీకి గ్లోబల్ అంబాసిడర్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ సమక్షంలో సెక్రటరీ జనరల్ కామన్వెల్త్ ద్వారా దాజీకి గ్లోబల్ అంబాసిడర్ అవార్డును అందజేశారు. ఐదు ఖండాలలో 56 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్రిసియా స్కాట్లాండ్ కేసీ ఈ అవార్డును అందజేశారు. ఈ మేరకు కామన్వెల్త్ జనరల్ సెక్రటరీ దాజీ సేవలపై ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

Daaji

‘‘దాజీ.. మానసిక ప్రశాంతత వెనుక జ్ఞానం, కరుణ, ఆధ్యాత్మిక శ్రేయస్సు పట్ల అచంచలమైన నిబద్ధతను కలిగి ఉంటారు. ప్రపంచంలో ప్రస్తుతం పెరుగుతున్న అస్తవ్యస్తమైన విభిన్న నేపథ్యాలో ప్రజలకు ఓదార్పు, ఆధ్యాత్మిక చింతనను అందిస్తుంది. తద్వారా విశ్వవ్యాప్తంగా సంపూర్ణమైన కరుణ, ఆధ్యాత్మికతను చిగురించేలా చేస్తుంది. అందుకే ఈ సంస్థ కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్‌గా గుర్తింపు పొందింది. శాంతిని నెలకొల్పడం, విశ్వాసాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకే గ్లోబల్ అంబాసిడర్ అనే బిరుదు వరించింది. ఈ బిరుదు పట్ల గర్విస్తున్నామని చెబుతున్నారు ఈ సంస్థ ప్రతినిథులు. ఈ సంస్థలో సభ్యులు కావడం వల్ల దయ, వినయం, స్ఫూర్తి, అపరిమితమైన కరుణ శాంతిని సాధించడానికి వీలుపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’’..  అని చెబుతూ కామన్వెల్త్ జనరల్ సెక్రటరీ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..