Covid 19 in Telangana: వదంతులకు చెక్.. ఆ ఇద్దరికి కరోనా లేదు.. మంత్రి క్లారిటీ

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఇద్దరు కరోనా అనుమానితుల నమూనాలను పుణెకు పంపగా.. వైరస్‌ లేదని రిపోర్టుల్లో తేలింది.

Covid 19 in Telangana: వదంతులకు చెక్.. ఆ ఇద్దరికి కరోనా లేదు.. మంత్రి క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 8:01 AM

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఇద్దరు కరోనా అనుమానితుల నమూనాలను పుణెకు పంపగా.. వైరస్‌ లేదని రిపోర్టుల్లో తేలింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (యువతి), అపోలో ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలి రిపోర్టుల్లో కరోనా నెగిటివ్‌గా వచ్చింది. దీంతో ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

అయితే ఓ మహిళా టెకీ, అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలికి మొదట ఇక్కడ పరీక్షలు నిర్వహిచారు. ఆ పరీక్షల్లో స్పష్టత కొరవడింది. దీంతో ఆ ఇద్దరికి కరోనా వచ్చినట్లు పుకార్లు ఎక్కువయ్యాయి. దీంతో వారి నమూనాలను పుణెకు పంపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టులో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా విషయంలో అతిగా స్పందించొద్దని సూచించారు. ఇదిలా ఉంటే మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు  వెల్లడించారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినా.. 14 రోజుల తరువాతనే డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు. ఇక గురువారం నాటికి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదు కాగా, మరో 45 నమూనాల ఫలితాలను పరీక్షల నిమిత్తం పంపించారు.

కరోనా లక్షణాలతో పరీక్షల కోసం గురువారం గాంధీలో 35 మంది చేరారు. ఇందులో కరోనా బాధితుడి సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 33 మంది నుంచి శాంపిళ్లు తీసుకొని పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు.  కాగా ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రికి 169 మంది కరోనా అనుమానితులు వచ్చారు. వారిలో 135 మందిలో వైరస్‌ లేదని తేలింది. మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉంది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !