Hyderabad: ఘోరం.. కొడుకును చూసేందుకు హైదరాబాద్ వచ్చిన దంపతులు.. తిరిగి ఇంటికి వెళ్తుండగా..
నూతన సంవత్సరం మొదటి రోజున హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఉదయం నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించారు.

నూతన సంవత్సరం మొదటి రోజున హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఉదయం నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
కాగా, హైదరాబాద్‌లో ఉన్న కొడుకును చూడడానికి వచ్చిన వృద్ధ దంపతులను మృత్యువు కబళించింది. మృతులు నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీధర్, రాజమణిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంపతులు రోడ్డు దాటుతుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దంపతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉదయం టిఫిన్ చేయడానికి రోడ్డు మీదకు వచ్చిన ఇద్దరినీ కారు ఢికొట్టడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రెండు కార్లను ఢీకొట్టిన కారు.. టిఫిన్ కోసం రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రణవ్, వర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
