మాపై దుష్ప్రచారం చేస్తున్నారుః హాస్టళ్ల అసోషియేషన్..!

హాస్టళ్లు నడపడంపై హాస్టళ్ల అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది. హాస్టళ్లు యథావిధిగా నడిపించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తాము హాస్టళ్లు మూసేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని..

  • Tv9 Telugu
  • Publish Date - 7:24 pm, Thu, 26 March 20
మాపై దుష్ప్రచారం చేస్తున్నారుః హాస్టళ్ల అసోషియేషన్..!

హాస్టళ్లు నడపడంపై హాస్టళ్ల అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది. హాస్టళ్లు యథావిధిగా నడిపించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తాము హాస్టళ్లు మూసేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని.. ఊరికి వెళ్లాలనే ఆత్రుతతో తమపై దుష్ప్రచారం చేశారని వారు అన్నారు. ఐటీ సెక్టార్ లో 7.50 లక్షలు మంది పీజీ , హాస్టల్ లో ఉన్నారని.. కానీ ఇప్పుడు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉన్నారని హాస్టల్ అసోషియేషన్ పోలీసులకు వివరించారు. హాస్టళ్లు యథావిధిగా నడిపేందుకు గానూ .. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తమకు పాస్ లు ఇవ్వాలని వారు వెల్లడించారు.

20 మంది కోసం హాస్టళ్లు నడుపుతున్నామని..  భవనాల అద్దెలపై, కరెంట్ బిల్లులపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. మేము హాస్టల్ నడపడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ తమ డిమాండ్స్ ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ఆదుకోవాలని వారు సూచించారు. ఎన్వోసీలు తీసుకొని వెళ్లి.. మరి వచ్చిన వారు కూడా ఇక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కాగా ఎన్వోసీలు తీసుకొన్న చాలా మంది ఉద్యోగులు ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో వారిని రాష్ట్రంలోకి అనుమతించని విషయం తెలిసిందే. క్వారంటైన్ పూర్తైన తరువాతే వీరిని రాష్ట్రంలోకి అనుమతిస్తామని.. ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు.

Read This Story Also: చిరు మూవీలో చెర్రీ రోల్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్‌ ఒప్పకుంటారా..!