Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

చిరు మూవీలో చెర్రీ రోల్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్‌ ఒప్పకుంటారా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Ram Charan in Acharya movie, చిరు మూవీలో చెర్రీ రోల్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్‌ ఒప్పకుంటారా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా చిరుతో రెండోసారి జత కట్టబోతుండగా.. రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీలో చెర్రీ పాత్రకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో చెర్రీ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ పాత్ర 30 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.

అంతేకాదు ఓ మిషన్ మీద వెళ్లిన చెర్రీ.. దాన్ని పూర్తి చేయకుండానే చచ్చిపోతాడట. ఇక ఆ తరువాత చెర్రీ కోరికను చిరు పూర్తి చేస్తాడని సమాచారం. ఇక ఈ పాత్ర సినిమాకు కీలకం కానుందని తెలుస్తోంది. ఈ పాత్రను విన్న వెంటనే చిరు, చెర్రీనే అనుకున్నారట. ఇంతవరకు రామ్ చరణ్‌ ఇలాంటి పాత్ర చేయకపోగా.. ఈ పాత్రకు తన కుమారుడు కరెక్ట్‌గా ఉంటాడని ఆయన భావించారట. ఈ క్రమంలో చివరకు చెర్రీనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఏ చిత్రం మామూలుగా ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. కరోనా నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Tags