చిరువ్యాపారులపై లాక్​డౌన్‌‌ ప్రభావం.. కళ తప్పిన రంజాన్..!

కరోనా మహమ్మారి కాటుకు చేతిలో ఉపాథి కరువైంది. ఉన్న పని పోయింది. లాక్​డౌన్‌‌ పుణ్యమాని కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి. నమ్ముకున్నవారికి కడుపునిండి పెట్టలేక నానావస్థలు పడుతున్నారు హైదరాబాద్ పాతబస్తీ ముస్లింలు. ఏడాదికోసారి వచ్చే పండుగను సంబురంగా జరుపుకునేందుకు ముస్లింలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రంజాన్ వచ్చిందంటే పండగే కాదు కొన్ని వేలమంది కడుపు నింపే ఉపాధి. ఆ నెల రోజులు భాగ్యనగర్ లో సందడే సందడి. చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే కాలు దూరదు. రంజాన్ […]

చిరువ్యాపారులపై లాక్​డౌన్‌‌ ప్రభావం..  కళ తప్పిన రంజాన్..!
Follow us

|

Updated on: May 23, 2020 | 3:46 PM

కరోనా మహమ్మారి కాటుకు చేతిలో ఉపాథి కరువైంది. ఉన్న పని పోయింది. లాక్​డౌన్‌‌ పుణ్యమాని కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి. నమ్ముకున్నవారికి కడుపునిండి పెట్టలేక నానావస్థలు పడుతున్నారు హైదరాబాద్ పాతబస్తీ ముస్లింలు. ఏడాదికోసారి వచ్చే పండుగను సంబురంగా జరుపుకునేందుకు ముస్లింలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రంజాన్ వచ్చిందంటే పండగే కాదు కొన్ని వేలమంది కడుపు నింపే ఉపాధి. ఆ నెల రోజులు భాగ్యనగర్ లో సందడే సందడి. చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే కాలు దూరదు. రంజాన్ నెలలో చార్మినార్ నుంచి మదీనా సర్కిల్ వరకు వచ్చిపోయే వెహికల్స్, జనాలతో రద్దీగా ఉండేవి. రోడ్డుకు రెండువైపులా షాపులు, వాటి ముందు తోపుడు బండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడేవి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మసాలా దినుసులు, సేమియా, బట్టలు, బుర్ఖాలు, ఖురాన్లు, ఖురాన్ స్టాండ్స్, అత్తర్, సుర్మా, టోపీలు, కాస్మొటిక్స్, హౌస్ హోల్డింగ్స్ ఇలా అన్ని బిజినెస్‌‌లూ ఫుల్ గా నడిచేవి. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఆ సీన్ కనిపించడం లేదు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సరి, బేసి సిస్టమ్ లో షాప్‌‌లు తెరిచినా కొనడానికి పెద్దగా జనం రావట్లేదంటున్నారు వ్యాపారులు. కరోనా దెబ్బకి రోడ్లలన్ని కళతప్పాయి. కర్ఫూతో రోడ్లపైకి జనం రావడానికి జంకుతున్నారు. ఇక ముఖ్యంగా రెండు మాసాలుగా ఉపాథి లేక జీవనాధారం కొల్పోయారు. కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లుగవ్వా కరువైంది. షాపింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. దీంతో రంజాన్ సీజన్ బిజినెస్ పై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం మక్కామసీదులో వేల మంది ప్రార్థనలు చేస్తుంటారు. ఈసారి లాక్​డౌన్ ఎఫెక్ట్ తో సిబ్బంది ఐదుగురుకి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. ఎక్కువమంది ఇండ్లల్లో, కొద్దిమంది షాపుల్లో ప్రార్థనలు చేసుకున్నారు. ఇన్నేండ్లలో ఇలాంటి రంజాన్ చూడనే లేదంటున్నారు స్థానిక ముస్లింలు. కరోనా రాకాసి నుంచి తొందరగా కోలు కోవాలని అశిస్తున్నారు.